ఒక తెలుగు పాట ను చాలా దేశాల musicians కలిసి పాడితే ఎలా ఉంటాది ? ఇది సినిమా పాట కాదు. Playing for change అని world peace కోసం చాలా దేశాల musicians తో పాటలు చేయడం ఈ ప్రాజెక్ట్. ఐతే వీళ్ళు ఎవరూ ఒకరినొకరు ఇంతకుముందు ఎప్పుడూ కలవలేదట. ఇందులో ఒక తెలుగు పాట కూడా వుంది. ఇది తెలుగు పాట అని producers కి కూడా తెలీదు అనుకుంటా. Indian folk song అని వుంది. కానీ ఈ youtube వీడియో చూడండి ఎంత బావుందో ..
Monday, December 14, 2009
చందమామ రావయ్యా..
Saturday, September 19, 2009
కిక్
Saturday, September 05, 2009
'జగన్' మన కాబోయే ముఖ్యమంత్రి?
Wednesday, September 02, 2009
అద్రృశ్యమయిన Y.S.రాజశేఖర రెడ్డి హెలికాప్టర్
వాతావరణం కారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Y.S. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ కనిపించకుండా పోవడంతో ఆంధ్రప్రదేశ్ దాదాపు స్థంబించిపోయింది. సాధారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం లో వ్యక్తిగత ప్రతిభ తో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడం రాజశేఖర రెడ్డి విజయమే. రాజశేఖర రెడ్డి కోసం గాలింపు గురించి వార్తల కోసం సాక్షి ఛానల్ ఇక్కడ చూడండి.
Wednesday, August 26, 2009
రోజూ ఇండియా కు ఫ్రీ ఫోన్ కాల్
రోజూ ఇండియా కి ఫోన్ చేయాలంటే 1-800-free-411 ( US లో మాత్రమే ) కి ఫోన్ చేయండి. అందులో ఒక option ఫ్రీ ఫోన్ కాల్. అది సెలెక్ట్ చేసుకుంటే 30 sec Ad విన్న తర్వాత 5 min ఫోన్ కాల్ చేయోచ్చు. ఓపిక వుంటే మళ్ళీ అదే నంబర్ కి కాల్ చేసి 5 mins మళ్ళీ మాట్లాడొచ్చు. ఈ ఫ్రీ 411 , US లో ఫ్రీ టెలిఫోన్ డైరెక్టరీ గా కూడా పనికొస్తుంది. ఇండియా కి కాల్ క్వాలిటీ ఓ.కే. ఫ్రీ గా వస్తే ఫినాయిల్ కూడా బావుంటాది కదా :)
Swagbucks తో పిచ్చి searches చేసినందుకు ఫ్రీ గిఫ్ట్ కార్డ్స్ , ఇప్పుడు ఫ్రీ ఫోన్ కాల్ బావుంది కదా. Swagbucks గురించి నా రివ్యూ ఇక్కడ.
Thursday, July 09, 2009
మారుతున్న ఇండియా.
Monday, June 29, 2009
swagbucks తో free గిఫ్ట్ కార్డులు
sగూగుల్ అంత విలువయిన కంపనీ ఎందుకంటే మనం గూగుల్ సర్చ్ చేసి వాళ్ళకు డబ్బులు తెప్పిస్తాము కాబట్టి. కాని సర్చ్ చేసినందుకు మనకూ డబ్బులు వస్తే? ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చినదే swagbucks. మనం సర్చ్ చేసినప్పుడు swagbucks అని కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ bucks తో మనం గిఫ్ట్ కార్డులు కొనుక్కోవచ్చు. ఐతే సర్చ్ చేసిన ప్రతిసారీ కాకుండా random గా ఈ swagbucks వస్తాయి. వీళ్ళ సైట్ ప్రకారం మన search results గూగుల్ నుండే వస్తాయని అంటారు. నిజంగానే ఫ్రీ గిఫ్ట్ కార్డ్స్ వస్తాయా అంటే. నిజమే. కాకపోతే ఈ సర్చెస్ తో బిల్ గేట్ కాలేము. వాళ్ల widget డౌన్ లోడ్ చేసుకొని అప్పుడప్పుడు సర్చ్ చేస్తే ఈ bucks వస్తాయి. 45 swagbucks తో $5 amazon గిఫ్ట్ కార్డ్ తీసుకోవచ్చు. నాలాగా రోజు మీరు ఏదో ఒకటి సర్చ్ చేస్తూవుంటే అప్పుడప్పుడు $5 గిఫ్ట్ కార్డ్స్ వస్తాయి అనుకోవచ్చు. నా observation ప్రకారం రోజుకు 3-4 swagbucks random గా వస్తాయి. ఒక్కోసారి సర్చ్ రెండు లేక మూడో పేజి లో ఇవి వస్తాయి. ఇంకా interesting గా చేయడానికి ఫ్రీ గిఫ్ట్ కోడ్స్ ఇస్తారు . అవి swagbucks webpage, facebook,twiiter ఇలా different లో పెడుతారు. ఇవి ఫాలో చేయడానికి swagcodes.com అనే వెబ్ సైట్ కూడా వుంది. మీ ఫ్రెండ్స్ ని రిఫర్ చేస్తే వల్ల మొదటి 100 bucks మీకు కూడా మ్యాచ్ చేస్తారు. నా వరకు ఇప్పటికి ఓ $ 50 వరకు వచ్చింది నేను చేసే పిచ్చి సర్చెస్ తో. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే క్రింది బ్యానర్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మొదటి ౩ bucks free గా ఇస్తారు.
Update: ఈ పోస్ట్ చేసిన తర్వాత నేను గమనించింది ఏమంటే మన IP address ని బట్టి ఎన్ని గంటల తర్వాత swagbucks వస్తాయో డిసైడ్ చేస్తారు అనుకుంటా. ఒకే కంప్యూటర్ నుండి సర్చ్ చేస్తే 5-6 గంటల తర్వాత swagbucks మళ్ళీ వస్తాయి. కాని డిఫరెంట్ ప్లేస్ నుండి సర్చ్ చేస్తే వెంటనే అయిన swagbucks వస్తాయి. ఇంట్లో వచ్చిన, ఆఫీసు లో మళ్ళీ వచ్చే అవకాశం వుంది అన్నమాట .
Friday, June 19, 2009
World twenty 20 లో India
అప్పుడెప్పుడో క్రికెట్ గురించి ఒక పోస్ట్ చేసి కాస్త ఒళ్ళు బద్ధకం ఎక్కువయ్యి మళ్ళీ రాయలేదు. కానీ మళ్ళీ మన వల్ల world cup performance చూసాక మళ్ళీ రాయాలనిపిస్తోంది. సెమీస్ కి కూడా చేరుకోలేకపోవడం బాగా బాధించే విషయం. కర్ణుడి చావుకి చాలా కారణాలు వున్నట్టు మనవాళ్ళ ఓటమికి కూడా చాలానే.
BCCI ఓటమికి కారణాలు కనుక్కుంటుందో లేదో కాని నాకు తోచినవి కొన్ని:
IPL తర్వాత world cup కి మధ్య చాలా తక్కువ సమయం వుంది. చాలా మంది మన ప్లేయర్లు IPL లో ఆడి కాళ్ళు,చేతులు ఇంచుకున్నారు. మిగతావాళ్ళు IPL మీద బాగా శ్రద్ధ పెట్టి అలసిపోయారు. మరి BCCI మాత్రం అలసిపోయిన వాళ్ళు ఆడకుండా వుండాల్సింది అంటారు. చాలా గొప్ప ఐడియా నే.
IPL అంటేనే డబ్బులు. players, BCCI అందరికీ మిలియన్ల డాలర్లు వస్తే దేశం కోసం ఎందుకు ఒళ్ళు వంచాలనిపిస్తుంది? ప్రపంచం లోనే richest leagues in baseball and basket ball వుండి కూడా USA మిగతా దేశాలతో ఆడేటప్పుడు ఎందుకు ఓడిపోతుందో ఇప్పటికైనా అర్థమయి వుండాలి.
కొన్ని విజయలకే తలకి పొగరెక్కి ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించే ధోని లాంటి వాళ్ళని ఏమనాలి?
క్రికెట్ మీద పిచ్చి తో BCCI ని, ప్లేయర్స్ ని నెత్తికి ఎక్కించుకొనే మనల్ని కూడా ఆమాట అనుకుంటే సరిపోతుంది.
Thursday, April 16, 2009
క్రికెట్ నియంతలు
స్పైడర్ మాన్ సినిమా చూసిన అందరికీ గుర్తుండే ఒక కొటేషన్ వుంది "With great power comes great responsibility" అని . దీన్ని మన BCCI పెద్దలకు గుర్తు చేయాలనుకుంటా. క్రికెట్ ప్రపంచం లో ఇండియా influence రోజురోజు కీ పెరిగిపోతోంది. ఎందుకంటే క్రికెట్ అంటే మనకు అంత అభిమానం. మన అభిమానం BCCI కి పెట్టుబడి. మరి మన influence ని చూసి సగటు క్రికెట్ అభిమాని ఆనంద పడకుండా బాధ పడవలసి రావడం దురదృష్టకరం. ఇందుకు కారణం మన క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ని నడుపుతున్న పెద్దలే. వాళ్లు చెప్పిందే వేదం. ICL లో ఆడే ఆటగాళ్ళని ఏ దేశం జట్టులో తీసుకోకూడదు అంటే అందరూ తలలు ఊపారు. IPL మొదటి సీజన్ హిట్ అవడంతో వాళ్ళకి అడ్డేలేదు. IPL రెండో సీజన్ కి ఎలక్షన్స్ అడ్డమని ప్రభుత్వం అంటే నియంతలకు కోపం వచ్చేసింది. మీ సెక్యురిటీ ఎవరికీ కావాలీ, మీ ప్రేక్షకులు ఎవరికి కావాలీ అని సౌత్ ఆఫ్రికాలో పెట్టేసారు. T.V లలో చూసే మహత్తర అవకాశం కల్పిస్తున్నాం కదా అని సెలవిచ్చారు. కరెక్టే అసలు మాచ్ చూడటానికి జనాలు ఎందుకు అవసరం? పెద్ద ఇండోర్ స్టేడియం లో ఎవరూ లేకుండా మాచ్ లు పెడ్తే సెక్యురిటీ ఖర్చే వుండదు కదా. మన లలిత్ మోడీ గారి బిజినెస్ బుర్ర కి ఇంకా ఈ ఆలోచన తట్టినట్టులేదు. అధికారం చేతిలో వున్న ప్రతి ఒక్కరికీ మనం లోకువే కదా. క్రికెట్ మధ్యలో వచ్చే సోపులు,బ్లేడులు,డ్రింక్స్ ఆడ్స్ చూసి , కొని ఈ నియంతల ఖజానులు నింపుదాం. ప్రీతి జింటా hug లు , షారుక్ గారి విన్యాసాలు చూసే టైం అయ్యింది .సెలవు మరి.It can happen only in India.
Saturday, March 28, 2009
నమ్మకం పోగొట్టుకోవడం ఎలా ?
రామోజీ రావు గారిని అడిగితే బాగా చెప్తారు అనుకుంటా . రాష్టం లో అత్యధిక సర్కులేషన్ కల పత్రికాధిపతి గా ఎంతో భాద్యత గల రామోజీ రావు గారు Y.S. రాజశేఖర్ రెడ్డి గారితో వ్యగ్తిగత పోరు కు ఈనాడు ను వాడుకోవడం చూస్తే భాధ వేస్తుంది. ఎప్పటినుండో తెలుగుదేశం పార్టీ కి అనుకూలంగా వున్నా మరీ ఇంత దిగజారుడు చూడలేదు. ఈ 5 సంవత్సరాలలో ఈనాడు లో వంద శాతం అధికార పార్టీ కి వ్యతిరేకంగా వార్తలే . Y.S.R కొడుకు జగన్మోహన్ రెడ్డి "సాక్షి" పత్రిక స్థాపించాక ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం తో పత్రికలు నిండిపోయాయి. వీళ్ళ గొడవలు చదవడానికి మనం ఎందుకు డబ్బులు పెట్టి పేపర్ కొనలో అర్థం కాదు. ఏమయినా ఈనాడు పేపర్ credibility మొత్తం నాశనం అయినట్టే. ఆ పేపర్ వాళ్లు రాస్తున్నారు కాబట్టి మేమూ రాస్తున్నాం అనడం సమర్థనీయ వాదన కాదు. NRI లలో ఎక్కువమందికి YSR
ప్రభుత్వం మీద అంత మంచి ఒపీనియన్ లేదేమో అని నేను ఇండియా లో ఓ ఫ్రెండ్ తో అంటే మీరు online లో ఈనాడు చదువుతారు కదా అందుకే అలా అనిపిస్తుందిలే అన్నాడు. నాకు కూడా అది ఒకవిధంగా నిజమేనేమో అనిపిస్తుంది. వార్త
కి నిష్పాక్షికత చాలా అవసరం కానీ మనం వున్న ఈ ప్రపంచం లో వాళ్లు చెప్పేదే వార్త. వినేవాళ్ళం మనమే వెర్రి మాలోకాలము.
Friday, March 20, 2009
రోజూ India కి free గా ఫోన్ చేయండి
మీకు ఇంటర్నెట్ ఉంటే మీ కంప్యూటర్ నుండి రోజూ 10 నిమిషాలు ఫ్రీగా ఇండియా కి ఫోన్ చేయొచ్చు. ఫ్రీ అంటే నిజంగా ఫ్రీ నా అని డౌట్ రావొచ్చుమీకు. నిజంగానే ఫ్రీ కాకపోతే ఫోన్ చేసేముందు 1 నిమిషం advertisement చూడాలి అంతే. tuitalk అనే సైట్ లో రిజిస్టర్ చేసుకొని వాళ్ళ dialing software డౌన్ లోడ్ చేసుకోండి.తర్వాత ఫోన్ చేయడమే. ఎన్నిరోజులు వుంటదో తెలీదు కాని నాకయితే ఒక వారం రోజులుగా పనిచేస్తోంది. వాయిస్ క్వాలిటీ ఓ.కే.
Sunday, January 11, 2009
The Band's Visit- a wondeful movie
We come across beautiful things in life unexpectedly.నేను ఏదో DVD చూస్తుంటే ఈ మూవీ ట్రైలర్ చూసా. ట్రైలర్ నచ్చి Blockbuster లో తెప్పించుకొని చూసాక అర్థమయింది accidental గా అయినా wonderful movie చూసా అని. ఇది Israeli మూవీ.సినిమా మొత్తం ఇంగ్లీష్,హీబ్రూ,అరబిక్ లో నడుస్తుంది. ఇంగ్లీష్ లో డైలాగ్ లేనప్పుడు సబ్ -టైటిల్స్ ఇంగ్లీష్ లో వస్తాయి.
కథ: ఓ ఈజిప్టు పోలీస్ బ్యాండ్ ఇజ్రాయిల్ లో అరబిక్ కల్చరల్ సొసైటీ opening ceremony కి ఇజ్రాయిల్ వస్తుంది. కాని airport లో వాళ్ళని receive చేసుకోవడానికి ఎవరూ రారు. వల్లే అక్కడికి వెళ్ళే ప్రయత్నం లో ఇజ్రాయిల్ లో ఓ మారుమూల ప్రదేశానికి వెళ్తారు. హోటల్స్ కూడా లేని అ ప్లేస్ లో ఓ రాత్రి వాళ్లు అక్కడ వున్నవారి ఇళ్ళలో వుండాల్సి వస్తుంది. ఆ రాత్రి ఎలా గడిచింది అన్నదే ఈ సినిమా.
ఈ సినిమా లో చేస్ లు ,ఫైట్లు ,పెద్ద పెద్ద డైలాగులు లేవు. అసలు మాటలే తక్కువ. మనం వేరే cultures,languages,religions నుండి వచ్చినా underlying human emotions ఒక్కటే అని చాలా subtle గా చూపించారు. అరబ్బులకి,ఇజ్రాయిల్ వాళ్ళకి అసలు పడకపోయినా one to one అందరికీ happiness,sadness,everyday problems are same అని చాలా బ్యూటిఫుల్ గా తీసారు.
ఈ సినిమా లో మరో highlight మ్యూజిక్ . చివర్లో వచ్చే అరబిక్ సాంగ్ చాలా meaningful. సినిమా అయిపోయినా ఆ పాటలు మనకు అలా గుర్తొస్తూనే వుంటాయి.
అలాగే ఆ సాంగ్ కి ఎవరో రాసిన అర్థం
My soul is blissful in the days spent in your arms
An eternal summer sun has brought back our forgotten days
Immortal days in a time when homesickness is sweet as honey
If I were to live this life all over again I wouldn't have changed a single second
Beautiful days where light shines freely
And the good that's between us fills our life with love and affection