స్పైడర్ మాన్ సినిమా చూసిన అందరికీ గుర్తుండే ఒక కొటేషన్ వుంది "With great power comes great responsibility" అని . దీన్ని మన BCCI పెద్దలకు గుర్తు చేయాలనుకుంటా. క్రికెట్ ప్రపంచం లో ఇండియా influence రోజురోజు కీ పెరిగిపోతోంది. ఎందుకంటే క్రికెట్ అంటే మనకు అంత అభిమానం. మన అభిమానం BCCI కి పెట్టుబడి. మరి మన influence ని చూసి సగటు క్రికెట్ అభిమాని ఆనంద పడకుండా బాధ పడవలసి రావడం దురదృష్టకరం. ఇందుకు కారణం మన క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ని నడుపుతున్న పెద్దలే. వాళ్లు చెప్పిందే వేదం. ICL లో ఆడే ఆటగాళ్ళని ఏ దేశం జట్టులో తీసుకోకూడదు అంటే అందరూ తలలు ఊపారు. IPL మొదటి సీజన్ హిట్ అవడంతో వాళ్ళకి అడ్డేలేదు. IPL రెండో సీజన్ కి ఎలక్షన్స్ అడ్డమని ప్రభుత్వం అంటే నియంతలకు కోపం వచ్చేసింది. మీ సెక్యురిటీ ఎవరికీ కావాలీ, మీ ప్రేక్షకులు ఎవరికి కావాలీ అని సౌత్ ఆఫ్రికాలో పెట్టేసారు. T.V లలో చూసే మహత్తర అవకాశం కల్పిస్తున్నాం కదా అని సెలవిచ్చారు. కరెక్టే అసలు మాచ్ చూడటానికి జనాలు ఎందుకు అవసరం? పెద్ద ఇండోర్ స్టేడియం లో ఎవరూ లేకుండా మాచ్ లు పెడ్తే సెక్యురిటీ ఖర్చే వుండదు కదా. మన లలిత్ మోడీ గారి బిజినెస్ బుర్ర కి ఇంకా ఈ ఆలోచన తట్టినట్టులేదు. అధికారం చేతిలో వున్న ప్రతి ఒక్కరికీ మనం లోకువే కదా. క్రికెట్ మధ్యలో వచ్చే సోపులు,బ్లేడులు,డ్రింక్స్ ఆడ్స్ చూసి , కొని ఈ నియంతల ఖజానులు నింపుదాం. ప్రీతి జింటా hug లు , షారుక్ గారి విన్యాసాలు చూసే టైం అయ్యింది .సెలవు మరి.It can happen only in India.
Thursday, April 16, 2009
క్రికెట్ నియంతలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment