Saturday, March 28, 2009

నమ్మకం పోగొట్టుకోవడం ఎలా ?

రామోజీ రావు గారిని అడిగితే బాగా చెప్తారు అనుకుంటా . రాష్టం లో అత్యధిక సర్కులేషన్ కల పత్రికాధిపతి గా ఎంతో భాద్యత గల రామోజీ రావు గారు Y.S. రాజశేఖర్ రెడ్డి గారితో వ్యగ్తిగత పోరు కు ఈనాడు ను వాడుకోవడం చూస్తే భాధ వేస్తుంది. ఎప్పటినుండో తెలుగుదేశం పార్టీ కి అనుకూలంగా వున్నా మరీ ఇంత దిగజారుడు చూడలేదు. ఈ 5 సంవత్సరాలలో ఈనాడు లో వంద శాతం అధికార పార్టీ కి వ్యతిరేకంగా వార్తలే . Y.S.R కొడుకు జగన్మోహన్ రెడ్డి "సాక్షి" పత్రిక స్థాపించాక ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం తో పత్రికలు నిండిపోయాయి. వీళ్ళ గొడవలు చదవడానికి మనం ఎందుకు డబ్బులు పెట్టి పేపర్ కొనలో అర్థం కాదు. ఏమయినా ఈనాడు పేపర్ credibility మొత్తం నాశనం అయినట్టే. ఆ పేపర్ వాళ్లు రాస్తున్నారు కాబట్టి మేమూ రాస్తున్నాం అనడం సమర్థనీయ వాదన కాదు. NRI లలో ఎక్కువమందికి YSR
ప్రభుత్వం మీద అంత మంచి ఒపీనియన్ లేదేమో అని నేను ఇండియా లో ఓ ఫ్రెండ్ తో అంటే మీరు online లో ఈనాడు చదువుతారు కదా అందుకే అలా అనిపిస్తుందిలే అన్నాడు. నాకు కూడా అది ఒకవిధంగా నిజమేనేమో అనిపిస్తుంది. వార్త
కి నిష్పాక్షికత చాలా అవసరం కానీ మనం వున్న ఈ ప్రపంచం లో వాళ్లు చెప్పేదే వార్త. వినేవాళ్ళం మనమే వెర్రి మాలోకాలము.

2 comments:

ramjee said...

స్మృతి గారు చాలా కరెక్ట్ గా చెప్పారు,అందుకే ఇంకో రెండు పేపర్లు కూడా చదివితే ఈనాడు చేసే మోసము + ఒకే విషయాన్ని మిగతా పేపర్ల లాగ కాకుండా దాన్ని మార్చి ఎంత దారుణంగా రాస్తారో అర్ధం చేసుకున్న వాళ్ళకే తెలుస్తూంది

సుజాత వేల్పూరి said...

ఈనాడు బాగా దిగజారిపోయిన మాట వాస్తవం! కానీ ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ గెలిస్తే రామోజీ పడబోయే పాట్లు దేవుడికే ఎరుక!ఇప్పటికే మార్గదర్శి విషయంలోనూ, రామోజీ ఫిల్మ్ సిటీ విషయంలోనూ ఉండవల్లి చేతిలో దెబ్బతిని ఉన్నాడు. అందువల్ల మహాకూట మిని గెలిపించి తీరాలంటే కాంగ్రెస్ మీద ఆ స్థాయిలో విరుచుకుపడుతూ మహాకూటమి నేతలు దగ్గినా, నవ్వినా బహు సుందరంగా ఉందని రాయక తప్పదు. ఎవరి కష్టాలు వాడివి.
ఇదివరలో ఇంత హీనంగా లేదు పరిస్థితి!ఇప్పుడు నిష్పక్షపాతంగా వార్తలు రాసే పత్రిక కానీ, ప్రసారం చేసే ఛానెల్ గానీ లేదు.


నిజమే, ఎన్నికలయ్యేదాకా పేపరు మానేస్తే సరి అనిపిస్తుందొక్కోసారి!