Sunday, July 06, 2008

జానే తు.....జానే న.


అబ్బాస్ టైరేవాల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా యువత కోసం ,యువ నటుల తో తీసినది. కథ కంటే కధనం ,వినోదం కోసం ఈ సినిమా చూడొచ్చు. ఆమీర్ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ మొదటి సినిమా ఇది. మొదటి సినిమా ఐనా కొత్త అనిపించకుండా బాగా చేసాడు. జెనీలియా కి ఇది మొదటి హిందీ సినిమా.ఇందులో జెనీలియాది అల్లరి అమ్మాయి పాత్ర. ఇంతకుముందు కూడా బొమ్మరిల్లు లాంటి సినిమాలలో చేయడం వలన ఆమెకి ఇది బాగా అలవాటైన రోల్. అబ్బాస్ టైరేవాల ఇంతకుముందు చాలా హిట్ సినిమాలకు స్క్రిప్ట్ అందించిన అనుభవం తో స్క్రిప్ట్ మీద బాగా శ్రద్ధ పెట్టాడు . ఈ సినిమా చూస్తున్నంత సేపు మనకు తివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే రాసినట్టు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు కూడా మనకు తెలుగు సినిమాలను గుర్తు చేస్తాయి. అమ్మాయి ని రౌడీలు ఏడిపిస్తుంటే హీరో రక్షించే సీన్ గుడుంబా శంకర్ ని గుర్తుచేస్తుంది. అలాగే మల్లేశ్వరి లోని ఒక సీన్ కూడా వుంది. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం రెండు సార్లు వింటే నచ్చుతుంది. మొత్తానికి ఈ సినిమా మంచి ఎంటర్ టైనర్ .ఆమీర్ఖాన్ ప్రొడక్షన్స్ కి మరో హిట్ .

Thursday, June 26, 2008

'చిరు' చిందులు

ఓ రేజర్ కంపనీ వాళ్ళు ఈ వీడియో లో మీ తల తగిలించి ఆనందించండి అంటే మన 'మెగా స్టార్' ఐతే బావుంటాది అని చిరు ని పెట్టా :) ఎలా వుంది అంటారు?



Tuesday, June 24, 2008

తెలంగాణా రాజకీయాలు


తెలుగుదేశం లో చంద్రబాబు తర్వాత నెం.2. గా వెలుగుతున్న దేవేందర్ గౌడ్ పార్టీ కి రాజీనామా చేసి తెలంగాణా కోసం పోరాడుతాను అంటూ ప్రకంటించారు. కొత్తగా పార్టీ పెడుతార లేక తె.రా.స తో కలుస్తారా తెలవాల్సి వుంది. కొత్త పార్టీ పెడితే ఇప్పటికే తెలంగాణా రాష్ట్ర సమితి, తెలంగాణా రాష్ట సమితి (అసమ్మతి) , తల్లి తెలంగాణా ఇలా రోజుకో పార్టీ వస్తే ఎవరికి ఓటు వెయ్యాలో నిజమయిన తెలంగాణా ప్రజలకు కష్టమే. ఇంకా చిరంజీవి కొత్త పార్టీ పెడితే బ్యాలట్ పేపర్ ఒక్కటి కాకూండా 2.-౩ ప్రింట్ చేయాలన్నమాట.

Saturday, June 21, 2008

హిందూ ఆత్మాహుతి దళం?


శివసేన నాయకుడు బాల్ థాకరే గారు మళ్ళీ హిందూ ఆత్మాహుతి దళాలు కావాలని సెలవిచ్చారు. ముస్లిం తీవ్రవాదులని ఎదుర్కోవడానికి ఇదొక్కటే మార్గం అన్నట్టు. మరి థాకరే గారు హిందూ ప్రజా సంరక్షకులు అనుకొందామంటే ఇంకో ఇబ్బంది వుంది. ఎందుకంటే థాకరే గారి ప్రకారం ముంబై లో మరాఠీ ప్రజలే వుండాలి. వారికే అన్ని వుద్యోగాలు ఇవ్వాలి.బీహార్ నుండి వచ్చేవాళ్ళు మనుషులే కాదు అన్నట్టు . మరి బీహార్ నుండో తమిళనాడు నుండో వచ్చిన హిందువులు ఆత్మాహుతి దళం లో సభ్యులా కాదా? మరి థాకరే గారి క్రెడిబిలిటీ ఎంతో ఆయనకే తెలవాలి.

Sunday, June 01, 2008

ఉప ఎన్నికల ఖర్చెంత?


తె.రా.స. అధ్యక్షుడికి వున్నట్టుండి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం గురించి (తె.రా.స. నాయకున్నయినా కావచ్చు) పట్టించుకోవడం లేదని , చూడండి నా తడాఖా అంటూ ఉప ఎన్నికలు తెచ్చారు. ఇప్పటికి ఎలక్షన్లు అయిపోయాయి ,రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. గెలిచిన వాళ్లు సంబరపడుతుంటే, ఓడినవాళ్ళు మొహాలు చాటేస్తున్నారు. కాని ఇలా ఆరు నెలలకోసారి దేశం లో నాయకులు ఇష్టం వచినట్టు ఎలక్షన్లు తెస్తే అయ్యే ఖర్చు భరించేది ఎవరు? దురదృష్ట వశాత్తు ఇలా ఇష్టారాజ్యంగా రాజీనామాలు చేసే వాళ్లు మళ్ళీ నిలబడకుండా ఎలాంటి రూల్స్ లేవు. కనీసం ఆ ఖర్చు వాళ్ళే భారిచేలా చేసినా బాగుండు. ఈ ఎన్నికల కోసం కోట్లు కుమ్మరించిన నాయకులు ఇప్పుడు వాటికి పదింతలు రాబట్టడానికి ప్లాన్లు తయారచేస్తుంటారు. అసలే టైం తక్కువుంది.

Wednesday, May 28, 2008

రాహుల్ గాంధీ మన కాబోయే ప్రధానమంత్రా?


రాహుల్ గాంధీ ని కాంగ్రెస్ తరపున వచ్చే ఎన్నికలలో ప్రధానమంత్రి అభ్యర్థి గా ప్రకటించాలని అర్జున్ సింగ్ లాంటి వాళ్లు కొత్త పాట మొదలు పెట్టారు ఈమధ్య. రాహుల్ గాంధీ కి ప్రధమంత్రి కావడానికి చాలానే అర్హతలున్నాయి. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ కొడుకు, ఇందిరాగాంధీ మనవడు, నెహ్రు కి ముని మనవడు ... అబ్బో చాలానే. ఇంతకంటే ఏమి కావాలి. ఇంతవరకు ఒక సారే పార్లమెంట్ కి ఎన్నికయ్యాడు . అయినా అది మరీ అంత అవసరమయిన విషయం కాదు లెండి . ప్రియాంకా గాంధీ కి కొడుకు పుడితే కాబోయే నాయకుడు అని స్వీట్స్ పంచుకున్న వాళ్ళకి ఇలాంటి వాటితో పని ఏముందిలే. రాహుల్ గాంధీ పేరుతో ఏదో ఒక పధకం పెట్టడానికి మన రాజశేఖర్ రెడ్డి ఎలాను వున్నాడు.

Wednesday, May 21, 2008

babies laughing



this is a funny video about 4 small babies laughing at the same time. worth watching.