Saturday, September 05, 2009

'జగన్' మన కాబోయే ముఖ్యమంత్రి?


It is said that "Leadership is action, not position." నాయకత్వమంటే చేతలు . అదో పదవి కాదు. Y.S. రాజశేఖర రెడ్డి దీన్ని అక్షరాల నిరూపించాడు.Actions speak louder than words. ఇంత మంది అభిమానుల్ని తన మాటలతో కంటే తను చేసిన పనులతో సంపాదించుకున్నాడు. రైతులకు ఈ మధ్యకాలంలో ఇంత చేయూతనిచ్చిన నాయకుడు ఎవరూ లేరేమో. రాజశేఖర రెడ్డి మృతి తో ఒక అలుపెరుగని నాయకుణ్ణి కోల్పోయాము. ఐతే దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి అంత్యక్రియలు కూడా ముగియకుండానే కాంగ్రెస్ పార్టీలో అంతఃకలహాలు మొదలయ్యాయి. ఒక వర్గం కాంగ్రెస్ నాయకులూ, మంత్రి వర్గం , జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి ని చెయాలని తీర్మానించారు. రాజశేఖర రెడ్డి మీద అభిమానం తో జగన్ ని ముఖ్యమంత్రి చేయాలనుకోవడం ఎంతవరకు సబబో అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి పదవి అనేది వంశపారపర్యం గా వచ్చేది కాదు కదా. Jagan కూడా రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు ఐతే ఆనందించాల్సిన విషయమే. ఐతే He has to prove his mettle before he claims this postion కదా . రాజశేఖర రెడ్డి కూడా దశాబ్దాలపాటు కష్టపడితేనే ఇక్కడికి చేరుకోగలిగాడు. 8 కోట్ల ప్రజలను పాలించాల్సిన నాయకుడు తన నాయకత్వాన్ని నిరూపించుకోవలసిన అవసరం వుంది కదా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరేమంటారు?

No comments: