Sunday, October 26, 2008

కొత్త బంగారు లోకం


మన సినిమా వాళ్ళకు ఒక సక్సెస్ ఎలాంటి inspiration ఇస్తుందంటే అలంటి సినిమాలే వంద తీయమని.
బొమ్మరిల్లు సినిమా మొదటిలో backdrop లో వచ్చే మాటలు గుర్తున్నాయా, తండ్రి కొడుకుల గురించి. 'దిల్' రాజు గారికి అవి నచ్చేసినట్టున్నాయి. ఈ సినిమా కూడా ఇలానే మొదలవుతుంది. కాకపోతే జయసుధ గారి డబ్బింగ్. ఎవరైనా పాపను పైకి ఎగరేస్తే నవ్వుతుంది ఎందుకంటే కింద తల్లో,తండ్రో పట్టుకుంటారనే నమ్మకం అట. ఇలాంటి అనాలిసిస్ ఎవరిదో కాని, తెలుగు సినిమా వాళ్ళకే తెలుస్తాయి. అంతకంటే ఇంకా సినిమా లో కెళ్తే. ఇలాంటి టీనేజ్ లవ్ స్టోరీస్ మనం వందల్లో చూసాము. ఇంకా చూస్తాము కూడా అనుకుంటా. కథ, కధనం ఏదీ ఆసక్తికరం గాలేదు. అంతకంటే చివర్లో ఇచ్చే ట్విస్ట్ ,దాని explanation చూస్తే నవ్వొచ్చింది.హీరో , హీరోయిన్ నటన గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక హీరోయిన్ కి డబ్బింగ్ ని చూసి తెలుగు భాష కి మనవాళ్ళు ఇచ్చే గౌరవం చూసి బాధ వేస్తుంది. తెలుగు ని ఎంత చెత్త గా మాట్లాడితే అంట స్టైల్ అనుకుంటా. మన భాష కి వేరే లాంగ్వేజ్ వాళ్ళతో డబ్బింగ్ చెప్పిస్తున్నారేమో స్టైల్ గా వుంటుందని. మొత్తానికి very disappointing మూవీ .

6 comments:

వర్మ said...

హమ్మయ్య .. బతికించారు నేను చూద్దాం అనుకున్నాను.. ఎందుకో ఈమద్య మంచి సినిమాలు రావటం లేదు . అదే రొటీన్... మొన్న చింతకాయల రవి చూసాను వాంతి వచ్చింది ....

Anil Dasari said...

ఇది చెత్త బంగారు లోకం. ఇందులో నాకు నచ్చిన ఒకే ఒక విషయం సినిమాలో అశ్లీలత, అసభ్యత ఎక్కడా లేకపోవటం. పాటల్లో సైతం హీరోయిన్‌కి వంటి నిండా బట్టలు కప్పటం. అది తప్ప సినిమాలో వినోదం కానీ, చెప్పుకోదగ్గ కధ కానీ లేవు. దీనికి ప్రేరణ అయిన బొమ్మరిల్లే నయం.

Kathi Mahesh Kumar said...

ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాల చేత అవమానించబడీ, ఛీత్కరించబడీ వున్ననాకు, ఈ సినిమా కొంచెం తెరపినిచ్చింది. గొప్ప సినిమాకాదుగానీ, చెత్త సినిమా మాత్రం కాదనిపించింది. బహుశా, "3త్రీ" అనే పరమచెత్త సినిమా చూసిన వెంఠనే, అదేరోజు ఈ సినిమా చూడ్డంవలనకావచ్చు.
పెద్దగీతపక్కన చిన్నగీతగీస్తే..ఇలానే ఉంటుందేమో!

సుజాత వేల్పూరి said...

అమ్మో, 3త్రీ బాగా లేదా? వెళ్దామనుకుంటున్నామే!

praveen. said...

ee movie chettaga lekapoyina very ordinary,disappointing movie andi maheshgaru.

Unknown said...

కత్తి గారు ౩ వల్ల మీకలా అనిపించవచ్చు మరో సారి చూడండి, అంతేమీ ఉండదు.