Monday, October 20, 2008

Wednesday ( movie)


NRI అబ్బాయి, ఫారిన్ లోకేషన్స్, non stop nonsense సినిమాలు చూసి చూసి , హిందీ movies ఫాలో అవడం నిలిపేసి చాలా రోజులు అయింది. కానీ ఈమధ్య ఖాళీ గా వున్నప్పుడు కొన్ని సినిమాలు చూసి మంచివి కూడా మిస్ అయ్యాననిపిస్తుంది. మొదటగా చెప్పాల్సింది wednesday మూవీ గురించి.
టైటిల్ లో వున్నట్టే ఈ సినిమా ఒక రోజు జరిగిన సంఘటనల గురించి .ఇంకా చెప్పాలంటే 4 గంటల వ్యవధిలో జరిగిన సంఘటనలు అంతే. సినిమా నిడివి కూడా 1 1/2 గంటలు మాత్రమే. ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సింది తీసిన విధానం. మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు మనల్ని కట్టిపడేస్తుంది. సినిమా అయిపోయాక గాని మనకు గుర్తు రాదు ఇందులో పాటలు కాని, హీరోయిన్ కానీ లేరని. ఈ సినిమా చూసాక నాకెందుకో హాలీవుడ్ మూవీ The insideman గుర్తొచ్చింది. రెండు సినిమాల కధల్లో similarities లేకపోయినా narration ఒకటే గా అనిపించింది. కొందరు ప్రతి indian తప్పకుండా చూడాల్సిన మూవీ అంటున్నా నాకు మాత్రం గొప్ప మూవీ కాకపోయీన మంచి మూవీ అనిపించింది. నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ అందరూ చక్కగా నటించారు. ఇది తప్పకుండ డైరెక్టర్ నీరజ్ పాండే మూవీ.

3 comments:

యడవల్లి శర్మ said...

ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన సినిమాల్లో ఇదొకటి...

Raj said...

నాకు కూడా నచ్చింది. సోది లేకుండా చెప్పాల్సిందాన్ని సూటిగా, ధాటిగా చెప్పింది ఈ సినిమా.

Rajendra Devarapalli said...

ప్రవీణ్ గారు మీరు navatarangam.com కూడా ఒక్కసారి చూడాలి.అక్కడా ఈ చిత్రం పై మంచి చర్చ జరిగింది.

http://navatarangam.com/2008/09/a-wednesday-review/