బీడీ
నా పెదవులతో బీడీ తాగాలన్న
చిరకాల వాంఛ తీర్చుకుందామనిపించి
కరీం బీడీ అనే కట్ట తీసి
అభిమానంగా అగ్గిపుల్ల వెలిగించా
నిప్పు అనే ఎరువు ని వేసి
దమ్ము అనే పంట కోసం ఎదురు చూసా
పీల్చి పీల్చి అలసిపోయాగాని
ఎంతమాత్రం దమ్ము రాదే
తిప్పి చూస్తే ఆగిపోయివుందే
ఒక్కసారిగా దుఖం ముంచుకొచ్చింది
దేదీప్యమానంగా వెలిగిపోయే బీడీ కాక
పుటుక్కున ఆరిపోయే బీడీ తెచ్చానని
తెలుసుకున్నా
నా తెలివితక్కువతనాన్ని నేనే
నిందించుకున్నా
ఆరిపోయిన బీడీ వంక దీనంగా చూసా
వృధా అయిపోయిన నా రూపాయిని చూసి
ఆక్రోశించా
నమ్మకము వంమయిపోయిందని వాపోయా
నిరాశ కసిగా మనసుని ఆక్రమిస్తూంటే
బాగా వెలిగే వేరే బీడీ కట్ట కోసం సాగిపోయా.
PS : ఇది అప్పుడెప్పుడో నేను tp.com లో బీడు అనే కవితని చూసి parady గా రాశాను.ఒరిజినల్ రచయిత్రి బాగా ఫీల్ అయినట్టున్నారు. తను ఏదో కవిత సీరియస్ గా రాస్తే నేను దానికి పిచి పేరడీ రాసానని.తర్వాత ఎప్పుడు రాయలేదు లెండి :) ఏవో పాత files చూస్తుంటే కనపడింది. ఇక్కడ మళ్ళీ పోస్ట్ చేస్తున్నా.
Sunday, October 12, 2008
బీడీ
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
బీడిల గురించి సిగరెట్టుల గురించి పేరడీలు బాగుంటాయి కాని ప్రయత్నించకండి. కోపం వస్తే తగ్గించవచ్చు, ఆరోగ్యమే మహా భాగ్యం. బాగుంది పేరడి.
Post a Comment