Thursday, October 09, 2008

చింతకాయల రవి- పాత చింతకాయల రవి



మొన్న శనివారం చింతకాయల రవి సినిమా చూసా. ఆ సినిమా దెబ్బకి తెలుగు సినిమా మొదటివారం లో ఇంక ఎప్పటికి చూడననుకుంటా. ఈ సినిమా చూస్తే ఇప్పటికీ మన సినిమా వాళ్లు తెలుగు ప్రేక్షకుడిని ఎంత తెలివిలేని వాళ్లు అనుకుంటున్నారో అర్థం అవుతుంది. హిందీ వాళ్లు ,తమిళ్ వాళ్లు ఇలాంటి సినిమాలు వదిలేసి కాస్త sensitive movies తీస్తుంటే మన వాళ్ల ధోరణి మాత్రం మారదు.
ఇలాంటి కధలు ఇప్పటికే వందల్లో వచ్చాయి కాబట్టి కధ గురించి చెప్పుకోవడానికి ఏమీలేదు.
ఒక పేరున్న హీరో, నలుగురో (డబ్బులుంటే పదిమంది) కమీడియన్లు, తల తోక లేని పది జోక్స్, ఫారిన్ లోకేషన్లు ఇదీ మన సినిమాల పరిస్థితి.
ఈ సినిమాలో కొన్ని ఆణిముత్యాలు .
1.హీరో గారు ఎంత మంచివాడో హీరోయిన్ కి తప్ప అందరికీ తెలుసు. అందరూ హీరో ని పొగడటానికే సినిమాలో కనబడుతారు. అమెరికా లో డాక్టర్లకి కూడా అదే పని. తెలుగు ని ఖూనీ చేస్తూ మాట్లాడే indian డాక్టర్ , american డాక్టర్, వేణు, అందరికీ అదే పని.. చివరికి సునీల్ కూడా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి అంటూ ఈ సినిమా కి వెళ్ళినందుకు మనకూ నీళ్లు తెప్పిస్తాడు.
2. హీరో గారి గురించి తెలుసుకున్న హీరోయిన్ తండ్రి పెళ్లి cancel చేస్తే , హీరోయిన్ ఇంటికి హీరో రొటీన్ గా తాగి వెళ్లి అల్లరి చేయడం నిజమయిన హీరోయిజమే.
౩. తను మంచి వాడు అని చెప్పించడానికి అనుష్క వెంటపడి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే మన జుట్టు పీక్కోవడం ఒక్కటే మిగిలింది.
4. సినిమా లో ఆలి వేషం, రోల్ ఏంటో అర్థమయితే ఒట్టు.
5. అమెరికా లో ఐనా toilet scene లాంటి absurd scenes వుండాల్సిందే.

3 comments:

K. D. said...

indulo toilet scene hindi movie partner lo nunchi copy , and exam scene mr.brean nunchi...ila anni mukkalani kalipi ee cinema teesaru nakithe ento chusam annattu kooda ledhu

Ramani Rao said...

రేపాదివారం వెళ్దామనుకొన్నాము. ఇది కూడా పాత చింతకాయ పచ్చడే నన్నమాట. ఇంకా నయం వెళ్ళేను కాదు! చెప్పి మంచి పని చేసారు ప్రవీణ్ గారు.

krishna rao jallipalli said...

పరమ పాత రోత కథ . ఈ సినిమాలో ప్రతి నా కొడుకు త్యాగాలు చేసేవాళ్ళే. అన్ని కుళ్ళు జోకులు, కంపు సీన్లు. పాపం ప్రదీప్ శక్తి ని చూసి జాలేసింది. రమణి గారు.... ఎదురు డబ్బిచ్చినా చూడొద్దు.