Monday, August 11, 2008

అభినవ్ బింద్రా..


అభినవ్ బింద్రా మొదటి సారి ఒలంపిక్స్ లో మన దేశానికీ వ్యక్తిగత విభాగం లో గోల్డ్ మెడల్ తెచ్చాడు. ఇది మన అందరికీ సంతోషకర వార్తే. 100 కోట్లు జనాభా గల దేశం ఒక మెడల్ కి మనం ఇంతగా సంబర పడుతున్నామంటే స్పోర్ట్స్ లో మన పరిస్థితి అంత దయనీయంగా వుండటమే కారణం . షరా మామూలు మన రాజకీయనాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు పోటీలు పడి వరాలు గురిపిస్తున్నారు. కరణం మల్లీశ్వరి, రాథోడ్ లాంటి వాళ్ళకు ఒలంపిక్స్ మెడల్ వస్తూనే ఇలా లక్షల్లో వరాలు కురిపించారు. దురదృష్ట వశాత్తు వాళ్లు మళ్ళీ ఆ వరాలతో స్పోర్ట్స్ ని మరచిపోయినట్టున్నారు. కరణం మల్లీశ్వరి ఐతే తర్వాతి ఒలంపిక్స్ టైం కి పోటీలో నిలబడలేనంత వొళ్ళు చేసిందట. మననాయకులు ఇప్పుడు ఇస్తున్న ప్రోత్సాహకాలు ఒలంపిక్స్ శిక్షణలో వున్న అథ్లెట్స్ కి ఇచ్చుంటే మరిన్ని పతకాలు వచ్చేవేమో. గుర్తింపు వచ్చినవాళ్ళకే మనం మరింత గుర్తింపు ఇస్తాము. మరి అలానే మన ఆటగాళ్ళు కూడా గుర్తింపు వచ్చాక ఆటను మరిచిపోయీ మిగతా విషయాల మీద శ్రద్ధ పెడుతారు. క్రికెట్ స్టార్స్ ,సానియా మిర్జా లాంటి వాళ్ళే ఇందుకు వుదాహరణ.అభినవ్ బింద్రా అలాకాకుండా మరిన్ని మెడల్స్ తెస్తాడని ఆశిద్దాం.

2 comments:

Anonymous said...

"గుర్తింపు వచ్చినవాళ్ళకే మనం మరింత గుర్తింపు ఇస్తాము." -సరిగ్గా చెప్పారు. ఒక స్థాయికి చేరిన వాళ్ళకే మన ప్రభుత్వం గుర్తిస్తుంది. వారికి ఇళ్ళూ, స్థలాలూ ఇస్తూ ఉంటారు. అవకాశాల కోసం, ప్రభుత్వ ఆసరా కోసం వెతుక్కునేవారు అవేమీ దొరక్క అలమటిస్తూంటారు.

చిన్న వయసులోనే పిల్లలను చేరదీసి, వారి భవిష్యత్తుకు (ముఖ్యంగా జీవనోపాధి విషయంగా) భద్రత కల్పించి శిక్షణనిస్తే, ఆటల్లో మనం మరింత ఉన్నత స్థానంలో ఉండే అవకాశం ఉంది.

Anil Dasari said...

ఫైనల్ పోటీలకి ముందు అభినవ్ బింద్రా తుపాకిని ఎవరో పాడు చేశారట. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, తుపాకి సరిగా ఉంటే అతని గురి లక్ష్యానికి అవతల తగిలుండాల్సింది, అది పాడయిన పుణ్యాన సరిగా టార్గెట్ మీద తగిలిందన్నమాట! అదీ బంగారు పతక రహస్యం.

(ఇది జోకు మాత్రమే బాబులూ. బింద్రా నైపుణ్యాన్ని మెచ్చుకుందాం).