రామోజీ రావు గారిని అడిగితే బాగా చెప్తారు అనుకుంటా . రాష్టం లో అత్యధిక సర్కులేషన్ కల పత్రికాధిపతి గా ఎంతో భాద్యత గల రామోజీ రావు గారు Y.S. రాజశేఖర్ రెడ్డి గారితో వ్యగ్తిగత పోరు కు ఈనాడు ను వాడుకోవడం చూస్తే భాధ వేస్తుంది. ఎప్పటినుండో తెలుగుదేశం పార్టీ కి అనుకూలంగా వున్నా మరీ ఇంత దిగజారుడు చూడలేదు. ఈ 5 సంవత్సరాలలో ఈనాడు లో వంద శాతం అధికార పార్టీ కి వ్యతిరేకంగా వార్తలే . Y.S.R కొడుకు జగన్మోహన్ రెడ్డి "సాక్షి" పత్రిక స్థాపించాక ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం తో పత్రికలు నిండిపోయాయి. వీళ్ళ గొడవలు చదవడానికి మనం ఎందుకు డబ్బులు పెట్టి పేపర్ కొనలో అర్థం కాదు. ఏమయినా ఈనాడు పేపర్ credibility మొత్తం నాశనం అయినట్టే. ఆ పేపర్ వాళ్లు రాస్తున్నారు కాబట్టి మేమూ రాస్తున్నాం అనడం సమర్థనీయ వాదన కాదు. NRI లలో ఎక్కువమందికి YSR
ప్రభుత్వం మీద అంత మంచి ఒపీనియన్ లేదేమో అని నేను ఇండియా లో ఓ ఫ్రెండ్ తో అంటే మీరు online లో ఈనాడు చదువుతారు కదా అందుకే అలా అనిపిస్తుందిలే అన్నాడు. నాకు కూడా అది ఒకవిధంగా నిజమేనేమో అనిపిస్తుంది. వార్త
కి నిష్పాక్షికత చాలా అవసరం కానీ మనం వున్న ఈ ప్రపంచం లో వాళ్లు చెప్పేదే వార్త. వినేవాళ్ళం మనమే వెర్రి మాలోకాలము.
Saturday, March 28, 2009
నమ్మకం పోగొట్టుకోవడం ఎలా ?
Labels:
eenadu,
indian news,
sakshi,
y.s.rajasekhar reddy
Friday, March 20, 2009
రోజూ India కి free గా ఫోన్ చేయండి
మీకు ఇంటర్నెట్ ఉంటే మీ కంప్యూటర్ నుండి రోజూ 10 నిమిషాలు ఫ్రీగా ఇండియా కి ఫోన్ చేయొచ్చు. ఫ్రీ అంటే నిజంగా ఫ్రీ నా అని డౌట్ రావొచ్చుమీకు. నిజంగానే ఫ్రీ కాకపోతే ఫోన్ చేసేముందు 1 నిమిషం advertisement చూడాలి అంతే. tuitalk అనే సైట్ లో రిజిస్టర్ చేసుకొని వాళ్ళ dialing software డౌన్ లోడ్ చేసుకోండి.తర్వాత ఫోన్ చేయడమే. ఎన్నిరోజులు వుంటదో తెలీదు కాని నాకయితే ఒక వారం రోజులుగా పనిచేస్తోంది. వాయిస్ క్వాలిటీ ఓ.కే.
Labels:
call india free,
internet call,
voip
Subscribe to:
Posts (Atom)