అమెరికన్ ప్రజలకు ఇప్పుడు కావాల్సింది మార్పు అని చరిత్ర సృష్టించిన నాయకుడు ఒబామా. ఒబామా అమెరికా ప్రెసిడెంట్ అవడం వలన ఎవరికి ఎంత లాభం ఎంత నష్టం అన్నది ఓ 4 ఏళ్లకు కానీ తెలీకపోవచ్చు.
మన( ఇండియన్ )దృష్టి తో చూస్తే :
1. అమెరికా లో గ్రీన్ కార్డ్స్ కోసం wait చేస్తున్న వాళ్ళకి పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. ఇప్పుడు మొదట అందరూ అంటున్నమాట ఎకానమీ... .ఎకానమీ ఇంప్రూవ్ అయినంతవరకు ఇమిగ్రేషన్ కి ప్రాధాన్యత వుండదు.
2. H1 visa కోటా పెరగడం కష్టమే ఎందుకంటే ఒబామా ఇంతకుముందే కోటా పెరగకుండా ఓటు వేసున్నాడు.
౩. Outsourcing కి కూడా ఒబామా వ్యతిరేకమే.
4. ఇరాక్,ఆఫ్ఘనిస్తాన్ లాంటి wars జరగకపోవచ్చు . కానీ ఆఫ్ఘాన్ యుద్ధం వలన ఇండియా కి లాభమే జరిగింది.
5. $ 200000 పైన సంపాదించేవాళ్ళకి tax పెంచడం వలన successful ఇండియన్స్ చాలా మందికి కాస్త నష్టమే.
6. Nuclear treaty లో పెద్ద changes వుండకపోవచ్చు.
కొన్ని పత్రికల్లో రాసినట్టు నాకయితే ఎగిరిగంతెసేంత ఉపయోగం ఐతే కనపడటం లేదు.
Saturday, November 08, 2008
ఒబామా
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
వెల్..నేను మెక్ కెయిన్ కు వోటు వేసానండి..వీలయినంత వరకూ బయాస్ లేకుండా సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తా.
బరాక్ ఒబామా అని కాదు కాని, డెమోక్రటిక్ పార్టీ మొదటినుంచి కూడా ఒక ప్రొటెక్షనిస్ట్ పార్టీ.. అది ఆల్వేస్ ప్రొ-యూనియన్ పార్టీ..దానికున్న బలమైన వోటింగ్ బేస్ నల్లవాళ్ళు మరియూ ఇతర మైనారిటీ వాళ్ళూ (ఈసారి, హిస్పానిక్స్ 68% వేసారు ఆ పార్టీకి) . 80-85% నల్ల వాళ్ళు ఎప్పుడూ ఈ పార్టీకే వేస్తారు..ఈసారి అది మరీ 95% కి వెళ్ళింది. అలా కాకుండా కూడా డెమొక్రటిక్ పార్టీ ఎజెండా ఎప్పుడూ ఆల్ మోస్ట్ సోషలిజం కి దగ్గరగా ఉంటుంది. ఫుడ్ స్టాంప్స్ కాని, EIC(earned income credit) కాని..ఇంకా ఎలంటివన్నీ కూడా ఆ పార్టీ ఎజెండా వల్ల వచ్చినవే. ఈ పార్టీ ఎప్పుడూ కూడా ఫ్రీ లంచ్ స్కీంస్, స్వీట్ కాండీ స్కీంస్ ఇంట్రడ్యూస్ చేయలని చూస్తుంటుంది. వాళ్ళ వోటు బేస్ అలాంటిది మరి.
ఇప్పటి దాకా చెప్పినవి ఫ్యాక్ట్స్. క్రిందది నా అభిప్రాయం.
అంతే కాదు..మీరు చెప్పిన $200,000 లిమిట్ కేవలం ఎలక్షన్ క్యాంపయిన్ లొ చెప్పింది. చూస్తూండండి.. ఆ లిమిట్ ఇంకా తగ్గుతుంది. వీళ్ళని రిచ్ ని డిఫైన్ చేయమంటే $1 మిలియన్ దగ్గర మొదలు పెట్టారు పోయిన సంవత్సరం. అక్కడనుంచి $250,000 దగ్గరకి వచ్చారు ఇప్పటికి. వీళ్ళు ఇప్పుడు వైట్ హౌస్ నీ, కాంగ్రెస్(254) నీ, సెనెట్(57) నీ కూడా డామినేట్ చేస్తున్నారు. దాంతో వీళ్ళు ఇప్పుడు ఆడిందే ఆట, పాడిందే పాట. ఎందుకంటే రిపబ్లికన్స్ కి వీటో ప్రూఫ్ ఎలాగు లేదు, ఫిలిబస్టర్ ప్రూఫ్ కూడా కేవలం 3 ఓట్ల కుషన్ మాత్రమే ఉంది.
దానికి తోడు ఒబామా కు కనీసం ఇద్దరు సుప్రీం కోర్టు జడ్జెస్ ని అపాయింట్ చేసే అవకాశమొచ్చేలా ఉంది. ఆయన కనక ఎక్స్ ట్రీం లెఫ్ట్ వింగ్ లిబరల్ జడ్జెస్ ని నయమిస్తారేమోనని భయమెలాగు ఉంది. (మీకు తెలుసు కదా వాళ్ళకి రిటైర్ మెంట్ యేజ్ లేదని, చనిపొయేదాకా ఉంటారని..). మోస్ట్ లిబరల్ జడ్జెస్ ఉంటే, ఇంక ACLU వాళ్ళకి పండగే పండగ.
సరే లెండి, నేను ఇంకా పేజీలకి పేజీలే రాయగలను కాని, చెప్పదలచు కున్నది ఏంటంటే, మీరు కనీసం చాలా మంది ఎడ్యుకేటేడ్ ఫూల్స్ ( who believe the media way too more than what they should be) లాగా కాకుండా కొంచెం skeptical గా ఉండి, స్వంత బుర్ర తో చూస్తున్నందుకు నేను చాలా సంతోషంతోనూ, గర్వంగానూ ఉంది. Media loves fairy tale stories. They love to reduce a complex and nuance situations into black and white stories, with potential of lots of drama and melody. What other best example you can find for such a story, than a large white country voting for a black guy in 400 years of history. That's a story book man..a classic cinema story(First of all, he is not a black-black guy..he is half-white).
Thanks for making me feel proud Praveen.
@కుమార్:
మీరు రిపబ్లికన్ అని మీరు చెప్పక ముందే వేరే చోట్ల మీ వ్యాఖ్యలతో ఊహించగలిగాను. మీ భావాలు మీవి, అవి వెల్లడించటంలో తప్పు లేదు. ఐతే, ఒబామాకి ఓటేసిన వాళ్లంతా మీడియా మాయలో పడిపోయారు, మీరు మరియు ఇతర రిపబ్లికన్లు మాత్రమే తెలివిగా వ్యవహరించారు అన్నట్లు మీర్రాయటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వోట్ బ్యాంకు రాజకీయాలు డెమొక్రాట్లే కాదు, రిపబ్లికన్లూ నడుపుతారన్న సంగతి తెలిసీ విస్మరించారా? ప్రజాస్వామ్య దేశాల్లో అది లేనిదెక్కడ? మనలాంటివారు దశాబ్ద కాలంగా అమెరికాలో ఉంటూ ఇక్కడి వ్యవహారాలపై సాధించిన అవగాహన కన్నా కొన్ని రెట్లు ఎక్కువే ఉంటుంది కదా ఇక్కడ పుట్టి పెరిగినవారికి. వాళ్లంతా వెర్రి వెంగళప్పలు అన్నట్లు మీరు కామెంట్ చేయటం అంతగా బాలేదు.
అబ్రకదబ్ర గారూ,
నా వ్యాఖ్యకి స్పందించినందుకు ధన్యవాదాలు. మీ రెస్పాన్స్ చూసి కొంచెం ఆశ్చర్య పడి, పైన నా కామెంట్ మళ్ళీ చదివితే, మీ కామెంట్ లో తప్పు యేమీ కనబడలేదు నాకు. బహుశా ఎవరైనా అలాగే రెస్పాండ్ అవుతారనుకుంటా. నా కామెంట్, పైన టపాకి స్పందిస్తూ నేను రాసిన విషయమే కాని, పూర్తి నేను కాదండి, అలాగే పూర్తి టపా రాసేప్పుడున్నంత నిడివి, వ్యాఖ్యకి కేటాయించలేము కదా..
అయితే, నేను రిపబ్లికన్ ని కాదు సార్, కావాలంటే నా వోటర్ రిజిస్ట్రేషన్ కార్డు కూడా చూపిస్తా. గత పదకొండు సంవత్సరాలుగా డెమొక్రటిక్ పార్టీ అంటే అభిమానం కల వ్యక్తి గానే ఉన్నాను. నేను మొట్టమొదటి సారి, రిపబ్లికన్ అభ్యర్థి(Mc Cain) కి వోటు వేసాను. అలా అనే కాకుండా, నేను ఎక్కువ నేర్చుకున్నా కొద్దీ, నాకు అంతకు ముందు గుడ్డిగా డెమొక్రటిక్ పార్టీ ని సపోర్ట్ చెసానేమో అని తెలిసొస్తా ఉంది. మన ఇండియన్సులో చాలా అధిక శాతం భాగం, గుడ్డిగా డెమొక్రటిక్ పార్టీని సపోర్ట్ చేస్తారు అన్నది నేను గమనించిన విషయం..ఒకప్పటి నాతో సహా. మన వాళ్ళు కూడా కేవలం మైనారిటీలు, ఇమ్మిగ్రంట్స్ అయినంత మాత్రాన, మిగతా మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళ లాగ, గొర్రెల్లాగా ఆలోచించకూడదనే నా స్నేహితుల మీదున్న అభిమానంతో, నేను ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూపించడానికి ప్రయత్నిస్తుంటా, అంతే కాని..
రిపబ్లికన్ పార్టీ ఐడెంటిటీ పాలిటిక్స్ గురించి, మీరు నాకు కాదు, నేనే అందరికీ చెప్పగలను. రష్ లింబా, షాన్ హానిటీ, మార్క్ లెవిన్..ఇంకా టాక్ రేడియో అటాక్ పాలిటిక్స్, కార్ల్ రోవ్ స్లైస్ అండ్ డైస్ పాలిటిక్స్, ఆయన Grand vision of creating permanent Republican Majority(re-destricting congress districts esp in TX), పోయిన రెండు ఎలక్షన్స్ లో వాళ్ళు గెలిచిన విధానం, వార్ హీరో అయిన జాన్ కెర్రీ ని swift-boat politics తో జీరో గా చూపించిన కుళ్ళు, కంపు కొట్టే రాజకీయాలు..
అమెరికన్ ప్రసిడెంట్ నిర్ణయాలని ప్రశ్నిస్తే, అదేదో anti-american attitude అన్నట్లుగా extreme-right-wing ఆడే నాటకాలు, Rupert Murdoch మహా సామ్రాజ్య విస్తీకరణ as if Fox News and New York Post are not enough(ఈయన వాల్ స్ట్రీట్ జర్నల్ కొన్నప్పుడు నాకు బాగా గుర్తు..అప్పుడే న్యూ యార్క్ నుంచి డెట్రాయిట్ వెళ్తున్నా..వెన్ను లోంచి ఒక జలదరింపు వెళ్ళింది నాకు. ఆ డీల్ ఫైనలైజ్ అయ్యినదని తెలియంగానే. మహా కవి శ్రీ శ్రీ చెప్పిన మాటలు 'కట్టు కథకూ, పెట్టుబడికీ పుట్టిన విష పుత్రికలే, వార్తా పత్రికలు" అన్న మాటలు నా మదిని ఎంతకీ వదిలి పెట్టలేదు).
రిపబ్లికన్ పార్టీ లో ఉండే గలీజు గురించి, పేజీలు కాదు, పుస్తకాలు రాయగలను సార్. ఎప్పుడైనా ఓఅక్లహోమా, డాల్లాస్, వెస్టర్న్ కాన్సాస్ బైబిల్ బెల్ట్ కి వెళ్ళారా, వాళ్ళతో మాట్లాడితే ఆశ్చర్య పోతాం మనం. ఇంకా 21 శతాబ్ధం లోనే వున్నామా అని. అంతెందుకు పెన్సిల్వేనియా లోని లాంకాస్టర్ కొంటీలో, ఆమిష్ కమ్యూనిటీ ఉండే ప్రాంతం దాటి ఇంకొంచెం లోపలికెళ్ళండి. కళ్ళెంబడి నీళ్ళొస్తాయి మీకు..దేవుడా నా ప్రజల మనసుని కొంచెమైన విశాలం చెయ్యి అని. వాళ్ళ వోట్లన్నీ రిపబ్లికన్ పార్టీ కే వెళ్తాయి. ఇంకో ఉదాహరణ..మేరీలాండ్ లో ఆబర్డిన్ ప్రాంతం అని ఉంటుంది, దాంట్లొ కొంచెం రిమోట్ కి వెళ్తే...భయంకరమయిన రెడ్ నెక్ ఏరియా..వాళ్ళతో మాట్లాడితే మీరు మళ్ళీ జన్మలో రిపబ్లికన్ పార్టీ కి వోటు వేయరు. షార్లెట్ లో బిల్లి గ్రాహాం హైవే మీదుగా వెళ్ళి, కొంచెం దిగి ఏ స్మాల్ టౌన్ లోకి వెళ్ళినా తెలుస్తుంది, నేను ఏం మాట్లాడుతున్నానో.
I am not a fan of Bush(but I am sympathetic to him), కాని బుష్ పాలన లో దేశం మరీ రైట్ కు వెళ్ళి పోతుందని చాలా భాధ పడిన వాళ్ళలో నేనూ ఓకడిని. థాంక్ గాడ్, నా భయాలు నిజం కాలేదు. గత నలభై,ఏభై సంవత్సరాలుగా డెమొక్రటిక్ పార్టీకి వెళ్ళని వర్జీనియా, నార్త్ కెరోలినా డెమొక్రటిక్ పార్టీకి, అందులోనూ సౌత్ లో ఉండేఅ ఆ రాష్త్రాలు నల్ల వ్యక్తి కి వోటు వేశాయి.ఇండియానా అయితే నాకిప్పటికీ ఆశ్చర్యమే.
నాలాంటి వాళ్ళు ఎప్పుడూ బాధ పడ్తుంతారెమో అబ్రకదబ్ర గారూ..దేశం ఇప్పుడు మరీ లెఫ్ట్ కి వెళ్ళి పోతుందేమోనని భయం పట్టుకుంది నాకు. దయ చేసి నా భయాల్ని ఎగ్గేవా చేస్తూనో, రిడిక్యూల్ చేస్తూనో కామెంట్ రాయకండి(మీరు రాయరని తెలిసినా కూడా) for I love this Country a lot. I really do.
కొంచెం ఎమోషనల్ గానూ, తెలుగు సినిమా ల్లో చెప్పినట్లుగానూ ఉంటుందని జంకుతున్నాను కాని, నా భార్య ని నేనెంత ప్రేమిస్తానో, నేనీ దేశాన్నీ అంతే ప్రేమిస్తా.
పోతే నాకు నల్ల వాళ్ళంటే ఏ మాత్రమూ వ్యతిరేక భావం లేదు అబ్రకదబ్ర గారూ..నిజం చెప్పాలంటే, వాళ్ళు ప్రాణాలొడ్డి సివిల్ వార్ లోని విజయాల్ని తెచ్చుకోకపోతే, నాలాంటి వాళ్ళు ఈ దేశంలో ఇంత స్వేచ్చ ని అనుభవించే వాళ్ళు కారు. ఆ నిజం నా రక్తంలో ప్రతి అణువు లోనూ ఇంకి పోయింది.
అలాగే ఒబామా అంటే నాకూ ఇష్టం. ఎవరైనా అతన్ని ఇష్ట పడక పోవడానికి అసలు ఏం కారణాలు చూపించగలరు?. అనుభవం లేకపోవడం అనేది, ఇష్ట పడక పోవడానికి కారణం కాజాలదు. డెమొక్రటిక్ పార్టీ లో ఉన్న చాలా మంది వెధవల కంటే, ఈయన కొన్ని వేల రెట్లు బెటర్. నా వైఫ్ ఒబామా గురించి ఇంప్రెస్స్ అయ్యి, తనకు వోటు వెస్తానంటే ఇంకా ప్రొత్సహించి, ఒబామా లో ఉన్న మంచి గురించి, కొన్ని గంటల పాటు చెప్పాన్నేను. ఈ రోజు వరకు కూడా ఒక్క సారి కూడా తన దగ్గర, ఒక్క నెగెటివ్ థింగ్ కూడా చెప్పలేదు.
అలా అని, ఇప్పుడు దేశంలో మీడియా కాని(watch Keith Olberman, Chris Mathew, Read Cynthia Tucker, Jonathan Alter and scores of others) ఆయన విపరీతాభిమానులు కాని, ఆయనేదో మెసయ్యా అనీ, ప్రపంచన్ని అగాధపు అంచుల్లోంచి రక్షించడానికి పుట్టిన పుత్రుడనీ..అలాంటి చెత్త భావ జాలాన్ని, నా గొంతులోకి దిగట్టొలాని ప్రయత్నిస్తే, నేను ఖశ్చితంగా ప్రొటెస్ట్ చేస్తా. నిన్ననే శొభా డే ఆర్టికల్ చదివా...ఒబామా, గాంధీ అంతటి వాడంట!! అరికాలి మంట నెత్తికెక్కింది నాకు. (వెంటనే రాసా ఘాటుగా).
అయితే నాకు ఒకే ఒక చోట నేను ఒబామా గారిని క్షమించలేక పోయా. ఇరవై సంవత్సరాలుగా పుల్ పిట్ మీద నుంచి, ఒక మనిషి, Anit-White, Anti-American hatred spew చేస్తున్నప్పుడు, అవి CDలుగా చేసి తన చర్చి లోనే అమ్ముతున్నప్పుడూ అది తెలిసీ(తెలియదనడం ఇంకొంచెం కోపం తెప్పించే విషయం) కూడా, ఒక్క సారీ ఆయన పబ్లిగ్గా ప్రొటెస్ట్ చేయకపోవటం నేను ఇప్పటికీ జీర్ణించుకోలేని విషయం. (మరీ ఇదే మనిషి ఇరాక్ వార్ గురించి, వీధుల్లోకి వచ్చి ఉపన్యాసిలిచ్చాడే, స్టేట్ సెనేటర్ గా ఉండీ, ఒక్క ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ కూడా చూడకుండా) . American President గా రన్ చేయాలి అన్నంత అడాసిటీ అప్పుడేమయ్యిందీ? అసలా పుస్తకం పేరే ఆ నీచుడు, నికృష్టుదూ అయిన జెరేమియా రైట్ ఇచ్చిన భావ రుణం.
అసలా చర్చిలో ఉన్నది పందులా, మనుషులా? అని గొంతు చించుకొని ఈ పెద్ద పంది అరుస్తా ఉంటే, చప్పట్లు కొట్టి ఎగుర్తా ఉన్నారేంటి?
ఆ ఒక్క కోపం తప్పితే ఒబామా గురించి నాకే వ్యతిరేకతా లేదు. నిజం చెప్పాలంటే, ఒబామా కి వచ్చిన ఇన్స్టాంట్ వర్ల్డ్ వైడ్ వచ్చిన పొలిటికల్ కాపిటల్, పాజిటివ్ ప్రెస్, మెక్ కెయిన్ కి ఎప్పటికీ వచ్చేది కాదు.
In the end, I care about America, not about Obama or Mc Cain.
I also want write about the vacuum, crisis in Republican Party, and how idiots like Rush Limbaugh and other far-right wing people are still pushing Sarah Palin, and how that is suicidal to the party. Moderate republicans like George Will, Peggy Noonan, Charles Krauthammer are being out-voiced by some morons on the right.
I am pained at their ignorance. I am really really pained. America is a great country to be hizacked by these extreme idealogues. We have learnt those lessons with those Neo-Conservative ba..rds, and these guys still insist that they are right.
సరే అబ్రకదబ్ర గారు, నన్ను కదిపిస్తే ఆపకుండా వెళ్ళిపోతానే ఉంటా..
క్లుప్తంగా చెప్పాలంటే, నాకు ఏ పార్టీ ముఖ్యం గాదు సార్, నాకు అమెరికా ముఖ్యం..Sounding like a politician right :-).
Sorry if I have inadvertently stepped on your shoes anywhere above..I am not reading what I wrote..It's too late in the night..and they scheduled a call at 7.30 in the morning..
Good Night Sir..God Bless You..
OOPS...చిన్న సవరణ
అసలా చర్చిలో ఉన్నది పందులా, మనుషులా? GOD DAMN AMERICA అని గొంతు చించుకొని ఈ పెద్ద పంది అరుస్తా ఉంటే, చప్పట్లు కొట్టి ఎగుర్తా ఉన్నారేంటి?
o
kumar gaaru thanks for expressing your deep thoughts about this topic. My opinion was far subtle. I was kind of skeptical about euphoria. thanks for visiting my blog.
Hi sanju, thanks for visiting my blog. I probably am not the correct person to guide you about writing blogs.My basic opinion is write whatever you feel like writing.some people like what you write and some dont.
Praveen.
Post a Comment