Sunday, July 20, 2008

అమ్మకానికి M.P లు

కాంగ్రెస్ , లెఫ్ట్ పార్టీల మధ్య అణు ఒప్పందం గొడవ ఈరోజు పార్లమెంట్ లో డబ్బులు జల్లడం తో ముగిసింది. ఇందులో ఎవరు ఎంత నిజం చెప్పుతున్నారో కనుక్కోవడం కష్టం కానీ అభాసు పాలయింది మాత్రం మన ప్రజాస్వామ్యమే. నేషనల్ పార్టీలు ,ప్రాంతీయ పార్టీలు అన్నీ దేశ భవిష్యత్తు కంటే తమ భవిష్యత్తే ముఖ్యం అని ప్రజలని వెర్రి వాళ్లు చేస్తే , T.V , మీడియా అన్నీ ఏక్తా కపూర్ సీరియల్ ( సాంస్, బహు ) లాగా మనకు నిమిషానికి ఒక ట్విస్ట్, టర్న్ ఇచ్చి రేటింగ్స్ పెంచుకున్నాయి. ఎప్పుడూ కత్తులు దూసుకొనే భా .జ.పా. , లెఫ్ట్ పార్టీలు ఫ్రెండ్స్ అయ్యాయి. చంద్రశేఖర్ రావు లాంటి అవకాశవాదులు తమ కోర్కెలకు , ఓటింగ్ కు లింకు పెట్టారు. ఇండిపెండెంట్లు తమ అదృష్టానికి తామే మురుసిపోయి ఎవరో ఒకరి దగ్గరి దగ్గరు డబ్బులు తీసుకుని ( 20 కోట్ల నుండి 100 కోట్ల వరకు ) ఏదో ఒక గ్రూపు లో చేరిపోయారు. మనం మాత్రం ఏమి చేయగలం జై హింద్ అనడం తప్ప. ఏదో ad లాగా It happens only in India.

Sunday, July 06, 2008

జానే తు.....జానే న.


అబ్బాస్ టైరేవాల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా యువత కోసం ,యువ నటుల తో తీసినది. కథ కంటే కధనం ,వినోదం కోసం ఈ సినిమా చూడొచ్చు. ఆమీర్ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ మొదటి సినిమా ఇది. మొదటి సినిమా ఐనా కొత్త అనిపించకుండా బాగా చేసాడు. జెనీలియా కి ఇది మొదటి హిందీ సినిమా.ఇందులో జెనీలియాది అల్లరి అమ్మాయి పాత్ర. ఇంతకుముందు కూడా బొమ్మరిల్లు లాంటి సినిమాలలో చేయడం వలన ఆమెకి ఇది బాగా అలవాటైన రోల్. అబ్బాస్ టైరేవాల ఇంతకుముందు చాలా హిట్ సినిమాలకు స్క్రిప్ట్ అందించిన అనుభవం తో స్క్రిప్ట్ మీద బాగా శ్రద్ధ పెట్టాడు . ఈ సినిమా చూస్తున్నంత సేపు మనకు తివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే రాసినట్టు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు కూడా మనకు తెలుగు సినిమాలను గుర్తు చేస్తాయి. అమ్మాయి ని రౌడీలు ఏడిపిస్తుంటే హీరో రక్షించే సీన్ గుడుంబా శంకర్ ని గుర్తుచేస్తుంది. అలాగే మల్లేశ్వరి లోని ఒక సీన్ కూడా వుంది. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం రెండు సార్లు వింటే నచ్చుతుంది. మొత్తానికి ఈ సినిమా మంచి ఎంటర్ టైనర్ .ఆమీర్ఖాన్ ప్రొడక్షన్స్ కి మరో హిట్ .

Wednesday, July 02, 2008

మత రాజకీయాలు


అమరనాథ్ దేవాలయానికి వంద ఎకరాల భూమి ఇవ్వడము కాశ్మీరు లో రాజకీయ సంక్షోబానికి దారి తీసింది . ముఫ్తీ మహమద్ సయీద్, అతని కూతురు మహబూబ లకు కోపం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు వుపహరించుకున్నారు. అలామద్దతు వుపహరించడానికి వాళ్ళు చెప్పిన కారణం ఆ వంద ఎకరాల భూమి లో హిందువులు ఎక్కువయి demographic composition మారుతుందట .మరి కాశ్మీర్ హింస కారణంగా వేళల్లో కాశ్మీరీ పండితులు వలసపోయినప్పుడు వీళ్ళు ఏమయ్యారు?