Saturday, June 21, 2008

హిందూ ఆత్మాహుతి దళం?


శివసేన నాయకుడు బాల్ థాకరే గారు మళ్ళీ హిందూ ఆత్మాహుతి దళాలు కావాలని సెలవిచ్చారు. ముస్లిం తీవ్రవాదులని ఎదుర్కోవడానికి ఇదొక్కటే మార్గం అన్నట్టు. మరి థాకరే గారు హిందూ ప్రజా సంరక్షకులు అనుకొందామంటే ఇంకో ఇబ్బంది వుంది. ఎందుకంటే థాకరే గారి ప్రకారం ముంబై లో మరాఠీ ప్రజలే వుండాలి. వారికే అన్ని వుద్యోగాలు ఇవ్వాలి.బీహార్ నుండి వచ్చేవాళ్ళు మనుషులే కాదు అన్నట్టు . మరి బీహార్ నుండో తమిళనాడు నుండో వచ్చిన హిందువులు ఆత్మాహుతి దళం లో సభ్యులా కాదా? మరి థాకరే గారి క్రెడిబిలిటీ ఎంతో ఆయనకే తెలవాలి.

3 comments:

సుజాత వేల్పూరి said...

థాకరే ప్రకారం ఆత్మాహుతి దళాలు కూడా మరాఠీ ప్రజలే అయి ఉండాలి. పోయే ప్రాణాల విలువ పోగొట్టేవాడికేం తెలుస్తుంది? అందుకే థాకరే కుటుంబం నుంచి కూడా ఆత్మాహుతి దళంలో సభ్యులు ఉండాలని దళంలో చేరే మూర్ఖ ప్రజలు కండిషన్ పెట్టాలి. వాడికి తెలియాలి 'నొప్పి 'అంటే ఏమిటో!

Kathi Mahesh Kumar said...

ధాకరే తన ఐడెంటిటీ పాలిటిక్స్ బాటలో తన ఐడెంటిటీని ఎప్పుడో కోల్పోయాడు. ఇక వ్యక్తిత్వమే లేని ఈ మరాఠా మానుస్ మాటకి విలువెక్కడుంది. ఈ మాటన్న వెంఠనే అరెస్టుచేసి పారెయ్యని ప్రభుత్వ నపుంసకత్వం పైన చూపాలి కినుక.

durgeswara said...

dEshabhakti. iimaatramteliyakakaadu gaamdhii gaaru ahimsaa maargaanni ennukunnadi.iidEshamennaDoo himsatO mamEkam kaadu.