Thursday, June 26, 2008

'చిరు' చిందులు

ఓ రేజర్ కంపనీ వాళ్ళు ఈ వీడియో లో మీ తల తగిలించి ఆనందించండి అంటే మన 'మెగా స్టార్' ఐతే బావుంటాది అని చిరు ని పెట్టా :) ఎలా వుంది అంటారు?



Tuesday, June 24, 2008

తెలంగాణా రాజకీయాలు


తెలుగుదేశం లో చంద్రబాబు తర్వాత నెం.2. గా వెలుగుతున్న దేవేందర్ గౌడ్ పార్టీ కి రాజీనామా చేసి తెలంగాణా కోసం పోరాడుతాను అంటూ ప్రకంటించారు. కొత్తగా పార్టీ పెడుతార లేక తె.రా.స తో కలుస్తారా తెలవాల్సి వుంది. కొత్త పార్టీ పెడితే ఇప్పటికే తెలంగాణా రాష్ట్ర సమితి, తెలంగాణా రాష్ట సమితి (అసమ్మతి) , తల్లి తెలంగాణా ఇలా రోజుకో పార్టీ వస్తే ఎవరికి ఓటు వెయ్యాలో నిజమయిన తెలంగాణా ప్రజలకు కష్టమే. ఇంకా చిరంజీవి కొత్త పార్టీ పెడితే బ్యాలట్ పేపర్ ఒక్కటి కాకూండా 2.-౩ ప్రింట్ చేయాలన్నమాట.

Saturday, June 21, 2008

హిందూ ఆత్మాహుతి దళం?


శివసేన నాయకుడు బాల్ థాకరే గారు మళ్ళీ హిందూ ఆత్మాహుతి దళాలు కావాలని సెలవిచ్చారు. ముస్లిం తీవ్రవాదులని ఎదుర్కోవడానికి ఇదొక్కటే మార్గం అన్నట్టు. మరి థాకరే గారు హిందూ ప్రజా సంరక్షకులు అనుకొందామంటే ఇంకో ఇబ్బంది వుంది. ఎందుకంటే థాకరే గారి ప్రకారం ముంబై లో మరాఠీ ప్రజలే వుండాలి. వారికే అన్ని వుద్యోగాలు ఇవ్వాలి.బీహార్ నుండి వచ్చేవాళ్ళు మనుషులే కాదు అన్నట్టు . మరి బీహార్ నుండో తమిళనాడు నుండో వచ్చిన హిందువులు ఆత్మాహుతి దళం లో సభ్యులా కాదా? మరి థాకరే గారి క్రెడిబిలిటీ ఎంతో ఆయనకే తెలవాలి.

Sunday, June 01, 2008

ఉప ఎన్నికల ఖర్చెంత?


తె.రా.స. అధ్యక్షుడికి వున్నట్టుండి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం గురించి (తె.రా.స. నాయకున్నయినా కావచ్చు) పట్టించుకోవడం లేదని , చూడండి నా తడాఖా అంటూ ఉప ఎన్నికలు తెచ్చారు. ఇప్పటికి ఎలక్షన్లు అయిపోయాయి ,రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. గెలిచిన వాళ్లు సంబరపడుతుంటే, ఓడినవాళ్ళు మొహాలు చాటేస్తున్నారు. కాని ఇలా ఆరు నెలలకోసారి దేశం లో నాయకులు ఇష్టం వచినట్టు ఎలక్షన్లు తెస్తే అయ్యే ఖర్చు భరించేది ఎవరు? దురదృష్ట వశాత్తు ఇలా ఇష్టారాజ్యంగా రాజీనామాలు చేసే వాళ్లు మళ్ళీ నిలబడకుండా ఎలాంటి రూల్స్ లేవు. కనీసం ఆ ఖర్చు వాళ్ళే భారిచేలా చేసినా బాగుండు. ఈ ఎన్నికల కోసం కోట్లు కుమ్మరించిన నాయకులు ఇప్పుడు వాటికి పదింతలు రాబట్టడానికి ప్లాన్లు తయారచేస్తుంటారు. అసలే టైం తక్కువుంది.