Showing posts with label BCCI. Show all posts
Showing posts with label BCCI. Show all posts

Friday, June 19, 2009

World twenty 20 లో India



అప్పుడెప్పుడో క్రికెట్ గురించి ఒక పోస్ట్ చేసి కాస్త ఒళ్ళు బద్ధకం ఎక్కువయ్యి మళ్ళీ రాయలేదు. కానీ మళ్ళీ మన వల్ల world cup performance చూసాక మళ్ళీ రాయాలనిపిస్తోంది. సెమీస్ కి కూడా చేరుకోలేకపోవడం బాగా బాధించే విషయం. కర్ణుడి చావుకి చాలా కారణాలు వున్నట్టు మనవాళ్ళ ఓటమికి కూడా చాలానే.
BCCI ఓటమికి కారణాలు కనుక్కుంటుందో లేదో కాని నాకు తోచినవి కొన్ని:
IPL తర్వాత world cup కి మధ్య చాలా తక్కువ సమయం వుంది. చాలా మంది మన ప్లేయర్లు IPL లో ఆడి కాళ్ళు,చేతులు ఇంచుకున్నారు. మిగతావాళ్ళు IPL మీద బాగా శ్రద్ధ పెట్టి అలసిపోయారు. మరి BCCI మాత్రం అలసిపోయిన వాళ్ళు ఆడకుండా వుండాల్సింది అంటారు. చాలా గొప్ప ఐడియా నే.
IPL అంటేనే డబ్బులు. players, BCCI అందరికీ మిలియన్ల డాలర్లు వస్తే దేశం కోసం ఎందుకు ఒళ్ళు వంచాలనిపిస్తుంది? ప్రపంచం లోనే richest leagues in baseball and basket ball వుండి కూడా USA మిగతా దేశాలతో ఆడేటప్పుడు ఎందుకు ఓడిపోతుందో ఇప్పటికైనా అర్థమయి వుండాలి.
కొన్ని విజయలకే తలకి పొగరెక్కి ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించే ధోని లాంటి వాళ్ళని ఏమనాలి?
క్రికెట్ మీద పిచ్చి తో BCCI ని, ప్లేయర్స్ ని నెత్తికి ఎక్కించుకొనే మనల్ని కూడా ఆమాట అనుకుంటే సరిపోతుంది.

Thursday, April 16, 2009

క్రికెట్ నియంతలు


స్పైడర్ మాన్ సినిమా చూసిన అందరికీ గుర్తుండే ఒక కొటేషన్ వుంది "With great power comes great responsibility" అని . దీన్ని మన BCCI పెద్దలకు గుర్తు చేయాలనుకుంటా. క్రికెట్ ప్రపంచం లో ఇండియా influence రోజురోజు కీ పెరిగిపోతోంది. ఎందుకంటే క్రికెట్ అంటే మనకు అంత అభిమానం. మన అభిమానం BCCI కి పెట్టుబడి. మరి మన influence ని చూసి సగటు క్రికెట్ అభిమాని ఆనంద పడకుండా బాధ పడవలసి రావడం దురదృష్టకరం. ఇందుకు కారణం మన క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ని నడుపుతున్న పెద్దలే. వాళ్లు చెప్పిందే వేదం. ICL లో ఆడే ఆటగాళ్ళని ఏ దేశం జట్టులో తీసుకోకూడదు అంటే అందరూ తలలు ఊపారు. IPL మొదటి సీజన్ హిట్ అవడంతో వాళ్ళకి అడ్డేలేదు. IPL రెండో సీజన్ కి ఎలక్షన్స్ అడ్డమని ప్రభుత్వం అంటే నియంతలకు కోపం వచ్చేసింది. మీ సెక్యురిటీ ఎవరికీ కావాలీ, మీ ప్రేక్షకులు ఎవరికి కావాలీ అని సౌత్ ఆఫ్రికాలో పెట్టేసారు. T.V లలో చూసే మహత్తర అవకాశం కల్పిస్తున్నాం కదా అని సెలవిచ్చారు. కరెక్టే అసలు మాచ్ చూడటానికి జనాలు ఎందుకు అవసరం? పెద్ద ఇండోర్ స్టేడియం లో ఎవరూ లేకుండా మాచ్ లు పెడ్తే సెక్యురిటీ ఖర్చే వుండదు కదా. మన లలిత్ మోడీ గారి బిజినెస్ బుర్ర కి ఇంకా ఈ ఆలోచన తట్టినట్టులేదు. అధికారం చేతిలో వున్న ప్రతి ఒక్కరికీ మనం లోకువే కదా. క్రికెట్ మధ్యలో వచ్చే సోపులు,బ్లేడులు,డ్రింక్స్ ఆడ్స్ చూసి , కొని ఈ నియంతల ఖజానులు నింపుదాం. ప్రీతి జింటా hug లు , షారుక్ గారి విన్యాసాలు చూసే టైం అయ్యింది .సెలవు మరి.It can happen only in India.