Monday, June 29, 2009

swagbucks తో free గిఫ్ట్ కార్డులు

sగూగుల్ అంత విలువయిన కంపనీ ఎందుకంటే మనం గూగుల్ సర్చ్ చేసి వాళ్ళకు డబ్బులు తెప్పిస్తాము కాబట్టి. కాని సర్చ్ చేసినందుకు మనకూ డబ్బులు వస్తే? ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చినదే swagbucks. మనం సర్చ్ చేసినప్పుడు swagbucks అని కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ bucks తో మనం గిఫ్ట్ కార్డులు కొనుక్కోవచ్చు. ఐతే సర్చ్ చేసిన ప్రతిసారీ కాకుండా random గా ఈ swagbucks వస్తాయి. వీళ్ళ సైట్ ప్రకారం మన search results గూగుల్ నుండే వస్తాయని అంటారు. నిజంగానే ఫ్రీ గిఫ్ట్ కార్డ్స్ వస్తాయా అంటే. నిజమే. కాకపోతే ఈ సర్చెస్ తో బిల్ గేట్ కాలేము. వాళ్ల widget డౌన్ లోడ్ చేసుకొని అప్పుడప్పుడు సర్చ్ చేస్తే ఈ bucks వస్తాయి. 45 swagbucks తో $5 amazon గిఫ్ట్ కార్డ్ తీసుకోవచ్చు. నాలాగా రోజు మీరు ఏదో ఒకటి సర్చ్ చేస్తూవుంటే అప్పుడప్పుడు $5 గిఫ్ట్ కార్డ్స్ వస్తాయి అనుకోవచ్చు. నా observation ప్రకారం రోజుకు 3-4 swagbucks random గా వస్తాయి. ఒక్కోసారి సర్చ్ రెండు లేక మూడో పేజి లో ఇవి వస్తాయి. ఇంకా interesting గా చేయడానికి ఫ్రీ గిఫ్ట్ కోడ్స్ ఇస్తారు . అవి swagbucks webpage, facebook,twiiter ఇలా different లో పెడుతారు. ఇవి ఫాలో చేయడానికి swagcodes.com అనే వెబ్ సైట్ కూడా వుంది. మీ ఫ్రెండ్స్ ని రిఫర్ చేస్తే వల్ల మొదటి 100 bucks మీకు కూడా మ్యాచ్ చేస్తారు. నా వరకు ఇప్పటికి ఓ $ 50 వరకు వచ్చింది నేను చేసే పిచ్చి సర్చెస్ తో. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే క్రింది బ్యానర్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మొదటి ౩ bucks free గా ఇస్తారు.
Update: ఈ పోస్ట్ చేసిన తర్వాత నేను గమనించింది ఏమంటే మన IP address ని బట్టి ఎన్ని గంటల తర్వాత swagbucks వస్తాయో డిసైడ్ చేస్తారు అనుకుంటా. ఒకే కంప్యూటర్ నుండి సర్చ్ చేస్తే 5-6 గంటల తర్వాత swagbucks మళ్ళీ వస్తాయి. కాని డిఫరెంట్ ప్లేస్ నుండి సర్చ్ చేస్తే వెంటనే అయిన swagbucks వస్తాయి. ఇంట్లో వచ్చిన, ఆఫీసు లో మళ్ళీ వచ్చే అవకాశం వుంది అన్నమాట .

Search & Win

Friday, June 19, 2009

World twenty 20 లో India



అప్పుడెప్పుడో క్రికెట్ గురించి ఒక పోస్ట్ చేసి కాస్త ఒళ్ళు బద్ధకం ఎక్కువయ్యి మళ్ళీ రాయలేదు. కానీ మళ్ళీ మన వల్ల world cup performance చూసాక మళ్ళీ రాయాలనిపిస్తోంది. సెమీస్ కి కూడా చేరుకోలేకపోవడం బాగా బాధించే విషయం. కర్ణుడి చావుకి చాలా కారణాలు వున్నట్టు మనవాళ్ళ ఓటమికి కూడా చాలానే.
BCCI ఓటమికి కారణాలు కనుక్కుంటుందో లేదో కాని నాకు తోచినవి కొన్ని:
IPL తర్వాత world cup కి మధ్య చాలా తక్కువ సమయం వుంది. చాలా మంది మన ప్లేయర్లు IPL లో ఆడి కాళ్ళు,చేతులు ఇంచుకున్నారు. మిగతావాళ్ళు IPL మీద బాగా శ్రద్ధ పెట్టి అలసిపోయారు. మరి BCCI మాత్రం అలసిపోయిన వాళ్ళు ఆడకుండా వుండాల్సింది అంటారు. చాలా గొప్ప ఐడియా నే.
IPL అంటేనే డబ్బులు. players, BCCI అందరికీ మిలియన్ల డాలర్లు వస్తే దేశం కోసం ఎందుకు ఒళ్ళు వంచాలనిపిస్తుంది? ప్రపంచం లోనే richest leagues in baseball and basket ball వుండి కూడా USA మిగతా దేశాలతో ఆడేటప్పుడు ఎందుకు ఓడిపోతుందో ఇప్పటికైనా అర్థమయి వుండాలి.
కొన్ని విజయలకే తలకి పొగరెక్కి ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించే ధోని లాంటి వాళ్ళని ఏమనాలి?
క్రికెట్ మీద పిచ్చి తో BCCI ని, ప్లేయర్స్ ని నెత్తికి ఎక్కించుకొనే మనల్ని కూడా ఆమాట అనుకుంటే సరిపోతుంది.