Saturday, November 08, 2008

ఒబామా


అమెరికన్ ప్రజలకు ఇప్పుడు కావాల్సింది మార్పు అని చరిత్ర సృష్టించిన నాయకుడు ఒబామా. ఒబామా అమెరికా ప్రెసిడెంట్ అవడం వలన ఎవరికి ఎంత లాభం ఎంత నష్టం అన్నది ఓ 4 ఏళ్లకు కానీ తెలీకపోవచ్చు.
మన( ఇండియన్ )దృష్టి తో చూస్తే :
1. అమెరికా లో గ్రీన్ కార్డ్స్ కోసం wait చేస్తున్న వాళ్ళకి పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. ఇప్పుడు మొదట అందరూ అంటున్నమాట ఎకానమీ... .ఎకానమీ ఇంప్రూవ్ అయినంతవరకు ఇమిగ్రేషన్ కి ప్రాధాన్యత వుండదు.
2. H1 visa కోటా పెరగడం కష్టమే ఎందుకంటే ఒబామా ఇంతకుముందే కోటా పెరగకుండా ఓటు వేసున్నాడు.
౩. Outsourcing కి కూడా ఒబామా వ్యతిరేకమే.
4. ఇరాక్,ఆఫ్ఘనిస్తాన్ లాంటి wars జరగకపోవచ్చు . కానీ ఆఫ్ఘాన్ యుద్ధం వలన ఇండియా కి లాభమే జరిగింది.
5. $ 200000 పైన సంపాదించేవాళ్ళకి tax పెంచడం వలన successful ఇండియన్స్ చాలా మందికి కాస్త నష్టమే.
6. Nuclear treaty లో పెద్ద changes వుండకపోవచ్చు.
కొన్ని పత్రికల్లో రాసినట్టు నాకయితే ఎగిరిగంతెసేంత ఉపయోగం ఐతే కనపడటం లేదు.

Sunday, November 02, 2008

శౌర్యం


టైటిల్ ,సినిమా పోస్టర్లను చూసి ఎలాంటి సినిమా నో వూహించుకోవడం కష్టం కాదు. సినిమా కూడా అలానే వుంది. ఇప్పుడు తెలుగులో పక్కా మాస్ సినిమాల హీరో అంటే గోపీచంద్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కూడా మాస్ సినిమాల ఫార్ములా తో నడుస్తుంది. హీరో, హీరోయిన్, విలన్, చెల్లి, సెంటిమెంట్ ఇలా. ఇలాంటి సినిమాలు చేసిన experience తో గోపీచంద్ లో ease కనపడుతుంది. అనూష్క మొదటి 1/2 లో మనకు ,హీరో కి కాస్త వినోదం పంచడానికి కనపడి తర్వాత తన అవసరం లేదని కనపడదు. జనాల్ని అలరించే ఫైట్స్ ,డైలాగులు చాలానే వున్నాయి. ఇలాంటి సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అని హీరో, డైరెక్టర్, నిర్మాత అందరికీ ముందే తెలిసి వుంటుంది. రారాజు, ఒక్కడున్నాడు లాంటి సినిమాల experience తో గోపీచంద్ ఇలాంటి సినిమాల వైపే మొగ్గు చూపుతున్నట్టున్నాడు. కాని ఏ హీరో ఐనా ఒకే తరహా సినిమాలే తీస్తుంటే కొన్ని రోజులకు జనాలకు విసుగొచ్చి చూడకపోవచ్చు. శ్రీహరి, ఆర్.నారాయణమూర్తి లాంటి వాళ్ళే ఇందుకు ఉదాహరణ. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలే కోరుతున్నారు కాబట్టి ఇలాంటివే చేస్తున్నాను అనడం బాగానే వుంది కాని వేరేవి చేస్తే కదా తెలిసేది చూస్తారో లేదో. ఒకటి ,రెండు పరాజయాలతో గోపీచంద్ లాంటి actor ఇలాంటి చట్రం లో ఇరుక్కుపోవడం కాస్త బాధ కలిగించే విషయం.