
రాహుల్ గాంధీ ని కాంగ్రెస్ తరపున వచ్చే ఎన్నికలలో ప్రధానమంత్రి అభ్యర్థి గా ప్రకటించాలని అర్జున్ సింగ్ లాంటి వాళ్లు కొత్త పాట మొదలు పెట్టారు ఈమధ్య. రాహుల్ గాంధీ కి ప్రధమంత్రి కావడానికి చాలానే అర్హతలున్నాయి. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ కొడుకు, ఇందిరాగాంధీ మనవడు, నెహ్రు కి ముని మనవడు ... అబ్బో చాలానే. ఇంతకంటే ఏమి కావాలి. ఇంతవరకు ఒక సారే పార్లమెంట్ కి ఎన్నికయ్యాడు . అయినా అది మరీ అంత అవసరమయిన విషయం కాదు లెండి . ప్రియాంకా గాంధీ కి కొడుకు పుడితే కాబోయే నాయకుడు అని స్వీట్స్ పంచుకున్న వాళ్ళకి ఇలాంటి వాటితో పని ఏముందిలే. రాహుల్ గాంధీ పేరుతో ఏదో ఒక పధకం పెట్టడానికి మన రాజశేఖర్ రెడ్డి ఎలాను వున్నాడు.
Wednesday, May 28, 2008
రాహుల్ గాంధీ మన కాబోయే ప్రధానమంత్రా?
Wednesday, May 21, 2008
babies laughing
this is a funny video about 4 small babies laughing at the same time. worth watching.
Sunday, May 18, 2008
మరో ధారుణం

మరో చోట బాంబులు. మారో సారి సామాన్య జనాల ప్రాణాలు ఆహుతి అయిపోయాయి. పోలీసులు,రాజకీయనాయకులు అందరూ ఇది తీవ్రవాదుల పని అన్నారు. పత్రికలూ రెండు రోజులు మొదటి పేజీల్లో రాసి మరచిపోయాయి.. మనం కూడా అప్పటికి పేపర్లలో చదివి అయ్యో అనేసి మరచిపోయాం. ఇంకోసారి ఇలాంటి సంఘటన జరిగేంతవరకు మనకు తీవ్రవాదం గుర్తుకురాదు. ఎందుకంటే మన దేశం లో ప్రాణానికి అంత విలువ లేదు కాబట్టి.
ఈ తీవ్రావాదులో ఎవరో కూడా బాగా తెలుసుకున్నారు. పెద్ద నాయకుల్ని హత్యచేస్తే పట్టుబడే అవకాశాలు ఎక్కువ. రాజీవ్ గాంధీ ని చంపినవాళ్ళు దొరికారు, ఇందిరాగాంధీ ని చంపినవల్ల ని కూడా పట్టుకున్నారు. ఢిల్లీ లో ,హైదరాబాద్ లో బాంబులు పెట్టినవాళ్లు ఏమయ్యారు, వారణాసి లో బాంబులు పెట్టినా మనకు అసలు ఏమీ పడదు.
మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆపే బాధ్యత ఎవరిది?
అసలు ఇలాంటివి జరిగిన మరుసటి రోజే ఏమీ జరగనట్టు సాధారణ పరిస్థితి నెలకొంటుంది . ఇది చూసే న్యూయార్క్ టైమ్స్ రైటర్ అంటాడు ఇది Indifference or resilience ? నాకయితే మొదటిదే కరెక్ట్ అనిపిస్తుంది. రోజు తీవ్రవాదుల మధ్య బ్రతుకుతూ వారితో పోరాడే ఇజ్రాయిల్ వాళ్ళది resilience .
ప్రపంచం లో తీవ్రవాదం తో అత్యధికంగా నష్టపోతున్నది ఇండియా కాని మనకు తీవ్రవాదం ఎదుర్కోవడానికి ఒక comprehensive plan లేదు. మనకు, మన నాయకులకు ఇలాంటివి అసలు ఆలోచించడానికి టైం ఎక్కడ? బాలీవుడ్ , IPL ఇవి అంతకంటే చాలా ముఖ్యం.
Monday, May 12, 2008
ఉగాది తర్వాత .
గత ఆరు నెలలుగా చలిదుప్పటి కప్పేసి చితికిపోయిన చెట్లు కాస్తా ఆకులు తెచ్చుకుంటే బాగానే వుంది. మా అపార్ట్ మెంట్ వాడు స్పెషల్ వ్యూ అంటూ ఇంకో యాభై డాలర్లు లాగడం మాత్రం బాధే :)
Sunday, May 04, 2008
పరుగు

ఈ శుక్రవారం పరుగు సినిమా చూసాను. సినిమా టైటిల్ మాత్రమే పరుగు. మొదటి భాగం అంతా నింపాదిగా ఒకే ఇంటి బేస్ మెంట్ లో నడుస్తాది :)
Sunday, April 27, 2008
హర్భజన్ సింగ్ కి క్రమశిక్షణ అవసరమా?

హర్భజన్ సింగ్ మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు ..ఈసారి శ్రీశాంత్ ని కొట్టి. అప్పుడు సైమండ్స్ ని తిట్టినప్పుడు చంకనెక్కించుకున్న బోర్డు, ఫాన్స్,మీడియా ఎప్పుడు ఏమిచేయాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు. మరి వేరే దేశం వాడిని తిడితే గొప్ప, మన వాడిని కొడితే తప్పు కదా. ఇప్పుడయితే కొట్టివూరుకున్నాడు. తర్వాత తర్వాత ఏమి చేస్తాడో,కొరుకుతాడో, తన్నుతాడో, గిచ్చుతాడో.. భళా హర్భజన్ సింగ్. జై క్రికెట్ బోర్డ్ ఆఫ్ ఇండియా. జై క్రికెట్ ఫాన్స్.
Tuesday, April 15, 2008
న్యూయార్క్ ఫోటోలు
ఈవారం న్యూయార్క్ కి నాలుగు రోజుల ట్రిప్ వేశా..... ఎన్నిసార్లు వెళ్ళినా నాకు బాగా నచ్చిన ప్లేస్ టైం స్క్వేర్ ... అక్కడి ఫోటోలు కొన్ని.......
Monday, April 07, 2008
ఉగాది శుభాకాంక్షలు

చాలా రోజుల తర్వాత నా బ్లాగ్ గుర్తొచ్చింది....నా స్మృతి అలా మతిమరుపు అయ్యింది. ఏమయితేనేమి మళ్ళీ ఉగాది రోజున మొదలు పెడుతున్నా....అందరికీ సర్వధార సంవత్సర శుభాకాంక్షలు.
బ్లాగర్లో ఈ మధ్య చాలా మార్పులు చేసారు . తెలుగులో బ్లాగ్ చేయడం బాగా సులువు అన్నమాట. ముందయితే బాగా కష్టం అయ్యేది. కానీ ఇందులో ఇంగ్లీష్ పదాలు పెట్టడం ఎలా అబ్బా? .......
Tuesday, July 04, 2006
చెలియ చెలియా
మన సినిమా నిర్మాతలు కానీ , మణిశర్మ కానీ ఈ వీడియో ఇంకా చూసినట్లు లేరు. లేకుంటే ఇప్పటికే international సింగర్ అని సినిమాలలో పాటలు పాడించేసి ఉండేవారు.
Wednesday, June 28, 2006
powers of ten
పవర్స్ ఆఫ్ టెన్ - ఈ వీడియో గురించి చెప్పడం కంటే మీరే చూడండి తెలుస్తుంది... ఆశ్చర్యపోవడం వరకే మనవంతు...
Monday, June 26, 2006
అంకురం
మధురం పాట విన్నాక ఎందుకో ఎప్పుడో విన్న అంకురం పాట గుర్తొచ్చింది...
ఉమామహేశ్వర రావు ఇంత మంచి సినిమా తీసి తర్వాత ఎందుకు అలా చెత్త సినిమాలు తీసాడో అర్థం కాదు....నటుల కోసం కాకుండా కథ కోసం తీయబడిన సినిమా....
మంచి అందమయిన పాట...రచయిత సిరివెన్నెలేనా?
ఎవరో ఒకరు, ఎపుడో అపుడూ....
నడవరా ముందుగా ......
అటో.. ఇటో.. ఎటో .. వైపు
మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీ
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ
తెలుప వచ్చు వాళ్లకు బాట అయినదీ
కదలరు ఎవ్వరూ నీ కూత వచ్చినా
అనుకొని కోడి కూత నిదురపోదుగా
జగతి మేలుకొలపు ఆగిపోదుగా...
Thursday, June 15, 2006
మధురం
ఆ మధ్యయెప్పుడో రిలీజ్ అయిన రాంగోపాల్ వర్మ సినిమా 'షాక్' నిన్న పొద్దుపోక చూస్తూంటే ఓ పాట బాగా నచ్చింది...
మధురం.....మధురం. మధురం....మధురం.. మధురం...మధురం...
ప్రణయం మధురం. కలహం మధురం....
క్షణమో సగమో విరహం మధురం...
సరసం మధురం...విరసం మధురం...
ఇలాసాగుతుంది....... అవన్నీ మధురమో కాదో నాకు తెలీదు కానీ ఆ పాట మాత్రం మధురం.
షాక్ అని ఇంగ్లీష్ టైటిల్ పెట్టిన సినిమాలో ఇంత అందమయిన తెలుగు పాట ఉండటం ఆశ్చర్యమో.......
Monday, April 17, 2006
మనసులో మాట
కొన్నాల్ల క్రితం ఈనాడు పేపరులో ఇద్దరు ఆడవాళ్ళ మధ్య జరిగిన వింత పెళ్ళి అంటూ ఓ వార్త వచ్చింది.చాలా దేశాలలో ఇది సాధారణమే కదా అని నేను మరీ అంతగా ఆశ్చర్యపోలేదు. కానీ వాళ్ళు అలా పెళ్ళి చేసుకోవడానికి చెప్పిన కారణమే కాస్త అయోమయానికి గురిచేసింది.... మగవాల్లపైన కోపంతో వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారట..అలా చేస్తే మగజాతి పైన కక్షసాధించినట్టా? అలా కాకుండా ఇద్దరూ ఇష్టపడి చేసుకున్నాం అంటే బావుండేదేమో.... ఎవరి ఆలోచనలువారివిలే... నాకయితే ఆడవారిపైన కోపంతో ఇంకో అబ్బాయిని పెళ్ళి చేసుకొనే ఆలోచనలేదు.... :)
Sunday, April 02, 2006
మనలో మాట
అడుక్కుని అయినా ప్రజల అవసారాలు తీరుస్తామని మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ సభలో ప్రకటించారట...
ఈ పథకం పేరేంటబ్బా ? " రాహుల్ జోలెబాట?"
Saturday, April 01, 2006
ఔను కదా.....
సాధారణంగా పత్రికల ఇంటర్వూలకు దూరంగా ఉండే అమీర్ ఖాన్ ఈ మధ్య టెహల్కా.కాం కి ఓ ఇంటర్వూ ఇచ్చాడు. అదృష్టవశాత్తు అది మన so called STARS egotist చెత్త కాకుండా అలోచింపజేసేలా ఉంది.
అందులో కొన్ని నాకు నచ్చిన ఆలోచనలు :
First of all, it’s meant to be a watchdog of society not a lap dog! Very broadly speaking, I feel the media has a grave responsibility as far as news reporting is concerned.
Things that are headline news now used to be tidbits or half a page meant to be entertaining. Now that’s the main story while farmers dying are being pushed to small, unimportant sections .
Celebrity marriages, lost dogs, drunken brawls. Trivial headline news and the sellout of mainstream journalism.
మల్లికా శరావత్ వొంపులు, మనీషా బాయ్ ఫ్రెండ్, త్రిషా చిందులు ఇవీ మన వార్తా పత్రికల ముఖ్యాంశాలు.......
Tuesday, March 21, 2006
ఓ సినిమా ఫోటో.......

పోకిరి అని factionist ఫేస్ పెట్టిన మహేష్ బాబు :) ఏంటో మన తెలుగు సినిమా వాళ్ళు ఎప్పటికీ అర్థం కారు ......
Tuesday, March 14, 2006
గూగుల్ తో ఓ రోజు
ఆంధ్రులు ఆరంభశూరులు అనడానికి నేను కూడా ఓ గొప్ప ఉదాహరణ అన్నమాట.ఆ మధ్య ఎప్పుడో బ్లగు మొదలు పెట్టి రెండురోజులు ఉత్సాహంగా రాసి తిరిగి ఇప్పుడే దీని మొహం చూడటం. ఈ మధ్యకాలంలో నేను చేసిందేంటంటే గూగుల్ వీడియోలు చూసి ఆనందపడటం...ఈ గూగుల్ వీడియో అనేది పిచ్చోడి చెతిలో రాయిలాంటిది.ఎలా అయినా వాడుకోవచ్చు.creativity కి ట్రయినింగ్ లాంటివికాదు presence of mind ఉంటేచాలు అని ఆ వీడియోలు చూస్తే అర్థం అవుతుంది... అందులో నాకు బాగా నచ్చింది master card కి spoof (పేరడీ). original చేయడానికి ఎంత creativity అవసరమో పేరడీ కి కూడా అంతే creativity అవసరం.ofcourse మన తెలుగు సినిమాలలో లాగా రజనీకాంత్ బాషా సినిమాలో అన్న dialogue ని ఆలీ,వేణుమాధవ్ ఇలా ఎవరు పడితే వాల్లతో పేరడీ పేరుతో అపహాస్యం చేయడానికి అసలు బుర్రే అవసరం లేదనుకోండి. మరి ఈ వీడియో చూసి ఆనందించండి.
ps : ఇది పెద్దలకు మాత్రమే :)
Monday, November 14, 2005
డైరీ
కొత్త పిచ్చోడు పొద్దెరగడు అన్నట్టు , కొత్త బ్లాగర్ గా రెండో రోజే ఇంకో పోష్టు చేస్తున్నా.
నాకు చిన్నప్పటి నుండి డైరీ రాయాలనే బలే కోరిక ఉండేది. 10th లో ఉన్నప్పుడు రాయడానికి ప్రయత్నించా. దాన్ని డైరీ అనే కంటే లాగ్ బుక్ అనడం బెటర్ ఏమో... ఈరోజు 9 గంటలకే నిద్ర లేచా...7 గంటలకు సినిమా చూసా...ఇలా ఉండేవి నా ఎంట్రీలు......అవి ఇప్పుడు చదివితే నాకే నవ్వొస్తాది...ఇప్పుడు డైరీ రాయాలంటే ఓపిక లేదు. అంతకు మించి నన్నే ఇబ్బంది పెట్టే నిజాలు రాసే ధైర్యం కూడా లేదు..డెరీ లో కూడా ఆత్మవంచన చేసుకోవాల్సివస్తుందేమో అని భయం.
డైరీ అంటే నామిత్రుడు రాజ్ (కలం పేరు సలీం ) తెలుగు పీపుల్.కాం లో ఒక అందమయిన కవిత రాసాడు. కవిత్వం ఒక అనుభూతి ని పంచితే ఎలా ఉంటుందో ఈ కవిత చదివితే తెలుస్తుంది.
డైరీ
ఎప్పుడో ఎక్కడో పోగొట్టుకున్న 'నన్ను' ని
ఈ కాగితాల్లోనే రోజూ వెతుకుతూ ఉంటాను
అనంతాలలో పారేసుకున్న అనుభూతుల వెచ్చదనాన్ని
ఈ కాగితాల్లోనే దాచుకుని నిత్యం తడుముతూ వుంటాను
ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు
ఎన్నోఆదర్శాల ఆవేశాలు
ఈ కాగితాల్లోనే రెప రెపలాడాయి
ఎన్నో కలలు కన్నీరై
ఎన్నో ప్రేమలు స్మృతిగీతాలై
ఈ కాగితాల్లోనే ఇంకుచుక్కలై ఇంకిపోయాయి
రాయాలని రాయలేక
రాయకుండా వుండలేక
పుటపుటకి ఎన్నోపురిటి నెప్పులు
ఈకాగితాల్లోనే పూర్తికాకుండా నిలిచిపోయాయి
కలకాలం నిలువలేక
కలిసి నాతో రాలేక
కదిలిపోయిన వసంతాలెన్నో
ఈ కాగితాల్లోనే పూలరెక్కలయి మిగిలి పోయాయి
నేటి 'నేడు' ని రేపటి 'నాడు' గా రాసుకోడానికి
ఈ కాగితాల్ని రొజు సవరిస్తూవుంటాను
ఎప్పుడో ఎక్కడో పోగొట్టుకున్న 'నన్ను' ని
ఈ కాగితాల్లోనే రోజూ వెతుకుతూ ఉంటాను.
ఒరిజినల్ పోష్టు, కామెంట్స్ చూడాలనుకుంటే ఈ లింక్ చూడండి.
http://www.telugupeople.com/discussion/article.asp?id=13074
Sunday, November 13, 2005
నాదీ బ్లాగేనంటారా ?

చాలా రోజులుగా బ్లాగింగ్ గురించి వినడమే కానీ ఎప్పుడూ ప్రయత్నించలేదు. so ఈ రోజు అలా గూగుల్ లో తెలుగు బ్లాగ్ అని search చేస్తే చాలా నే కనపడ్డాయి. అందులో sahiti.org blogs లో మురళి గారి బ్లాగ్స్ బాగా నచ్చాయి. అలా ఆ inspiration తో చేస్తున్న ప్రయత్నమే ఈ బ్లాగ్.
"స్మృతి" అని యెందుకంటారా.....నాకు మతిమరుపు ఎక్కువ. అదే కదా paradox of life. నా మతిమరుపు కి అందమయిన పేరు ఇచ్చుకున్నా...ఈ పేరు తోనే మా high school get together జరుపుకున్నాం.. మా college సావనీర్ కి కూడా అదే పేరు.....అలా "స్మృతి" పథంలో వుందనమాట.
ఇంతకు ముందు telugupeople.com లో బాగా పాల్గొనేవాణ్ణి కాని ఇప్పుడు అక్కడ discussions కంటే fights ఎక్కువ నడుస్తుంటాయి..అక్కడ నాకు నచ్చిన కవితలు..ఆర్టికల్స్ గురించి ఇంకోసారి చెప్తాను...:).
fall colors కొన్ని ప్రదేశాల్లో చాలా బావుంటాదని వినటమే కానీ ఎప్పుడూ చూడలేదు...అందుకని మా ఇంటి ముందు colors ఫోటో తీసా.ఎలా వుందంటారు?