Saturday, December 20, 2008

బుష్ కు పరాభవం

ప్రసిడెంట్ బుష్ ఈ మధ్య ఇరాక్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఓ జర్నలిస్ట్ అతనిపై shoes విసిరి తన కోపాన్ని వెళ్ళగక్కాడు. అది నచ్చిన వాళ్ళకు అతనో హీరో అయిపోయాడు. ఓ సౌది దేశస్తుడు ఆ shoes ని 10 మిలియన్ డాలర్లకు కొనడానికి offer ఇచ్చాడట. బుష్ అంటే అరబ్ ప్రపంచంలో ఎంత కోపమో ఇదో ఉదాహరణ మాత్రమే. ఐతే అమెరికా లో చెప్పులు విసిరితే మనం అనుకున్నంత అవమానంగా అనుకోరు. ఆ షూస్ ని బుష్ అంత easy గా తప్పించుకోవడం చూస్తే, అమెరికా అధ్యక్షులకి ఇలాంటి వాటి మీద training ఇస్తారా అని డౌట్ వస్తోంది :)
Youtube లో ఆ వీడియో

Sunday, December 14, 2008

ఇందుకు అభినందనలా?


వరంగల్ లో ఇంజినీరింగ్ చేస్తున్న ఇద్దరు విద్యార్థినుల మీద ముగ్గురు ఓ బైక్ లో వచ్చి ఆసిడ్ పోయడంతో వాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇలా చాలా సంఘాలు ఆందోళనలు మొదలు పెట్టాయి. ముందే ఆ అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతుర్ని వేధిస్తున్నారు అని కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోని పోలీసులు, ఈ సంఘటన జరిగిన 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారంటే కాస్త అభినందించాల్సిందే. కాని మరో 6 గంటల్లోనే కాల్చేసి 'ఎన్ కౌంటర్' అనడమే ధారుణం. పోలీసులు చెప్తున్న కారణాలు ,జరిగిన తీరు వింటే చిన్న పిల్లాడైనా చెప్పగలడు ఇది కట్టు కధ అని. అంతకంటే బాధాకరం ఏంటంటే ప్రజలు, మహిళా సంఘాలు పోలీసులని అభినందిస్తున్నారట. ఆ ముగ్గురు చేసింది హేయమైన చర్యే కాని పోలీసులు తమ కష్టడీ లో వున్నవాళ్ళని చంపడం సమర్ధనీయం కాదు. ఇప్పుడు వాళ్లు చేసిన తప్పుకు సరైన శిక్ష అనిపించవచ్చు కాని మనది ఆటవిక న్యాయం కాదు కదా, వాళ్లు ఆసిడ్ పోసారు మేము చంపేసాము అనడానికి. పోలీసు వ్యవస్థ పని నేరస్తులను పట్టుకోవడం వరకే ,శిక్షించడం కాదు. రెండూ వాళ్ళే చేస్తే వారిని నియంత్రించేది ఎవరు? రాత్రి 12 గంటల సమయం లో వాళ్లు వాడిన బైక్ కోసం జన సంచరాం లేని ప్రదేశానికి తీసుకొని వెళ్ళాం, వాళ్లు మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు అందుకే చంపేసాము అనడం పచ్చి అబద్దం. ఇది దిగజారిన మన వ్యవస్థని మరింత దిగాజార్చడమే. మనుషులని చంపి తందూరీ లో పెట్టినవాళ్ళు, తాగిన మైకం లో కారు మనుషులపైన నడిపి చంపిన వాళ్ళని మనం ఏమీ చేయం కాని , ఇలాంటి వారికి మాత్రం తగిన న్యాయం జరిగిందని ఆనందిస్తాం . ఈ ముగ్గురు కూడా రాజకీనాయకుల కోడకులో, బాగా డబ్బున్నవాల్లో అయ్యుంటే ఇలా జరిగి వుండేదా.