Sunday, October 26, 2008

కొత్త బంగారు లోకం


మన సినిమా వాళ్ళకు ఒక సక్సెస్ ఎలాంటి inspiration ఇస్తుందంటే అలంటి సినిమాలే వంద తీయమని.
బొమ్మరిల్లు సినిమా మొదటిలో backdrop లో వచ్చే మాటలు గుర్తున్నాయా, తండ్రి కొడుకుల గురించి. 'దిల్' రాజు గారికి అవి నచ్చేసినట్టున్నాయి. ఈ సినిమా కూడా ఇలానే మొదలవుతుంది. కాకపోతే జయసుధ గారి డబ్బింగ్. ఎవరైనా పాపను పైకి ఎగరేస్తే నవ్వుతుంది ఎందుకంటే కింద తల్లో,తండ్రో పట్టుకుంటారనే నమ్మకం అట. ఇలాంటి అనాలిసిస్ ఎవరిదో కాని, తెలుగు సినిమా వాళ్ళకే తెలుస్తాయి. అంతకంటే ఇంకా సినిమా లో కెళ్తే. ఇలాంటి టీనేజ్ లవ్ స్టోరీస్ మనం వందల్లో చూసాము. ఇంకా చూస్తాము కూడా అనుకుంటా. కథ, కధనం ఏదీ ఆసక్తికరం గాలేదు. అంతకంటే చివర్లో ఇచ్చే ట్విస్ట్ ,దాని explanation చూస్తే నవ్వొచ్చింది.హీరో , హీరోయిన్ నటన గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక హీరోయిన్ కి డబ్బింగ్ ని చూసి తెలుగు భాష కి మనవాళ్ళు ఇచ్చే గౌరవం చూసి బాధ వేస్తుంది. తెలుగు ని ఎంత చెత్త గా మాట్లాడితే అంట స్టైల్ అనుకుంటా. మన భాష కి వేరే లాంగ్వేజ్ వాళ్ళతో డబ్బింగ్ చెప్పిస్తున్నారేమో స్టైల్ గా వుంటుందని. మొత్తానికి very disappointing మూవీ .

Monday, October 20, 2008

Wednesday ( movie)


NRI అబ్బాయి, ఫారిన్ లోకేషన్స్, non stop nonsense సినిమాలు చూసి చూసి , హిందీ movies ఫాలో అవడం నిలిపేసి చాలా రోజులు అయింది. కానీ ఈమధ్య ఖాళీ గా వున్నప్పుడు కొన్ని సినిమాలు చూసి మంచివి కూడా మిస్ అయ్యాననిపిస్తుంది. మొదటగా చెప్పాల్సింది wednesday మూవీ గురించి.
టైటిల్ లో వున్నట్టే ఈ సినిమా ఒక రోజు జరిగిన సంఘటనల గురించి .ఇంకా చెప్పాలంటే 4 గంటల వ్యవధిలో జరిగిన సంఘటనలు అంతే. సినిమా నిడివి కూడా 1 1/2 గంటలు మాత్రమే. ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సింది తీసిన విధానం. మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు మనల్ని కట్టిపడేస్తుంది. సినిమా అయిపోయాక గాని మనకు గుర్తు రాదు ఇందులో పాటలు కాని, హీరోయిన్ కానీ లేరని. ఈ సినిమా చూసాక నాకెందుకో హాలీవుడ్ మూవీ The insideman గుర్తొచ్చింది. రెండు సినిమాల కధల్లో similarities లేకపోయినా narration ఒకటే గా అనిపించింది. కొందరు ప్రతి indian తప్పకుండా చూడాల్సిన మూవీ అంటున్నా నాకు మాత్రం గొప్ప మూవీ కాకపోయీన మంచి మూవీ అనిపించింది. నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ అందరూ చక్కగా నటించారు. ఇది తప్పకుండ డైరెక్టర్ నీరజ్ పాండే మూవీ.

Sunday, October 12, 2008

బీడీ


బీడీ
నా పెదవులతో బీడీ తాగాలన్న
చిరకాల వాంఛ తీర్చుకుందామనిపించి
కరీం బీడీ అనే కట్ట తీసి
అభిమానంగా అగ్గిపుల్ల వెలిగించా
నిప్పు అనే ఎరువు ని వేసి
దమ్ము అనే పంట కోసం ఎదురు చూసా
పీల్చి పీల్చి అలసిపోయాగాని
ఎంతమాత్రం దమ్ము రాదే
తిప్పి చూస్తే ఆగిపోయివుందే
ఒక్కసారిగా దుఖం ముంచుకొచ్చింది
దేదీప్యమానంగా వెలిగిపోయే బీడీ కాక
పుటుక్కున ఆరిపోయే బీడీ తెచ్చానని
తెలుసుకున్నా
నా తెలివితక్కువతనాన్ని నేనే
నిందించుకున్నా
ఆరిపోయిన బీడీ వంక దీనంగా చూసా
వృధా అయిపోయిన నా రూపాయిని చూసి
ఆక్రోశించా
నమ్మకము వంమయిపోయిందని వాపోయా
నిరాశ కసిగా మనసుని ఆక్రమిస్తూంటే
బాగా వెలిగే వేరే బీడీ కట్ట కోసం సాగిపోయా.
PS : ఇది అప్పుడెప్పుడో నేను tp.com లో బీడు అనే కవితని చూసి parady గా రాశాను.ఒరిజినల్ రచయిత్రి బాగా ఫీల్ అయినట్టున్నారు. తను ఏదో కవిత సీరియస్ గా రాస్తే నేను దానికి పిచి పేరడీ రాసానని.తర్వాత ఎప్పుడు రాయలేదు లెండి :) ఏవో పాత files చూస్తుంటే కనపడింది. ఇక్కడ మళ్ళీ పోస్ట్ చేస్తున్నా.

Thursday, October 09, 2008

చింతకాయల రవి- పాత చింతకాయల రవి



మొన్న శనివారం చింతకాయల రవి సినిమా చూసా. ఆ సినిమా దెబ్బకి తెలుగు సినిమా మొదటివారం లో ఇంక ఎప్పటికి చూడననుకుంటా. ఈ సినిమా చూస్తే ఇప్పటికీ మన సినిమా వాళ్లు తెలుగు ప్రేక్షకుడిని ఎంత తెలివిలేని వాళ్లు అనుకుంటున్నారో అర్థం అవుతుంది. హిందీ వాళ్లు ,తమిళ్ వాళ్లు ఇలాంటి సినిమాలు వదిలేసి కాస్త sensitive movies తీస్తుంటే మన వాళ్ల ధోరణి మాత్రం మారదు.
ఇలాంటి కధలు ఇప్పటికే వందల్లో వచ్చాయి కాబట్టి కధ గురించి చెప్పుకోవడానికి ఏమీలేదు.
ఒక పేరున్న హీరో, నలుగురో (డబ్బులుంటే పదిమంది) కమీడియన్లు, తల తోక లేని పది జోక్స్, ఫారిన్ లోకేషన్లు ఇదీ మన సినిమాల పరిస్థితి.
ఈ సినిమాలో కొన్ని ఆణిముత్యాలు .
1.హీరో గారు ఎంత మంచివాడో హీరోయిన్ కి తప్ప అందరికీ తెలుసు. అందరూ హీరో ని పొగడటానికే సినిమాలో కనబడుతారు. అమెరికా లో డాక్టర్లకి కూడా అదే పని. తెలుగు ని ఖూనీ చేస్తూ మాట్లాడే indian డాక్టర్ , american డాక్టర్, వేణు, అందరికీ అదే పని.. చివరికి సునీల్ కూడా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి అంటూ ఈ సినిమా కి వెళ్ళినందుకు మనకూ నీళ్లు తెప్పిస్తాడు.
2. హీరో గారి గురించి తెలుసుకున్న హీరోయిన్ తండ్రి పెళ్లి cancel చేస్తే , హీరోయిన్ ఇంటికి హీరో రొటీన్ గా తాగి వెళ్లి అల్లరి చేయడం నిజమయిన హీరోయిజమే.
౩. తను మంచి వాడు అని చెప్పించడానికి అనుష్క వెంటపడి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే మన జుట్టు పీక్కోవడం ఒక్కటే మిగిలింది.
4. సినిమా లో ఆలి వేషం, రోల్ ఏంటో అర్థమయితే ఒట్టు.
5. అమెరికా లో ఐనా toilet scene లాంటి absurd scenes వుండాల్సిందే.